New Delhi, April 26: కాంగ్రెస్ (Congress) పార్టీకి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (Prashant Kishor) హ్యాండ్ ఇచ్చారు. కొన్ని రోజులుగా ఆయన వరుసగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో (Sonia Gandhi) సమావేశమవుతున్నారు. ఎన్నికల వ్యూహకర్తగా కాకుండా పార్టీలో నాయకునిగా చేరడం దాదాపు ఖాయం అయ్యిందని వార్తలు తెగ ప్రచారంలోకి వచ్చాయి. అయితే.. వీటన్నింటిని పటాపంచలు చేస్తూ.. కాంగ్రెస్ పార్టీయే బాంబు పేల్చింది. ప్రశాంత్ కిశోర్ (Prashant Kishor) కాంగ్రెస్ లో చేరడం లేదని వెల్లడించింది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చేరికపై ఎన్నో అశలు పెట్టుకున్న కొందరి కాంగ్రెస్ నేతల ఆశలపై నీళ్లు చల్లారు అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా (Randeep Surjewala). ప్రశాంత్ కిశోర్ ప్రజెంటేషన్, చర్చల అనంతరం.. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ సాధికారత చర్య బృందం-2024ను (Empowered Action Group 2024) ఏర్పాటు చేశారు. అయితే అందులో భాగమయ్యేందుకు పీకేను (PK) కాంగ్రెస్ లో చేరాలని ఆహ్వానించారు. కానీ ఆయన దానికి ఒప్పుకోలేదని సుర్జేవాలా వెల్లడించారు. కాంగ్రెస్‌కు సలహాలు, సూచనలు ఇచ్చినందుకు ప్రశాంత్ కిశోర్ కు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు.
I declined the generous offer of #congress to join the party as part of the EAG & take responsibility for the elections.
In my humble opinion, more than me the party needs leadership and collective will to fix the deep rooted structural problems through transformational reforms.
— Prashant Kishor (@PrashantKishor) April 26, 2022
అటూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఉదారమైన ఆహ్వానాన్ని తిరస్కరించినట్లు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వెల్లడించారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుర్జేవాలా (Randeep Surjewala Tweet) ట్వీట్ చేసిన కొంత సమయం తర్వాత పీకే ట్వీట్టర్‌లో స్పందించారు. తాను పార్టీలో చేరడం కంటే ముఖ్యమైన ఎన్నో మార్పులు కాంగ్రెస్ కు అవసరం అని ప్రశాంత్ కిశోర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి పటిష్ట నాయకత్వం, సమన్వయం అవసరమని చెప్పారు. కాంగ్రెస్ లో క్షేత్రస్థాయిలో సంస్కరణలు, మార్పులు జరగాలని పరోక్షంగా విమర్శించారు.
Following a presentation & discussions with Sh. Prashant Kishor, Congress President has constituted a Empowered Action Group 2024 & invited him to join the party as part of the group with defined responsibility. He declined. We appreciate his efforts & suggestion given to party.
— Randeep Singh Surjewala (@rssurjewala) April 26, 2022
ఈ వ్యవహారం మొత్తానికి ముందు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సుధీర్ఘంగా చర్చలు జరిపారు. పలు మార్లు జరిగిన ఈ భేటీలకు పార్టీ సీనియర్ నేతలు కూడా హాజరయ్యారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహాలపై పీకే సోనియా గాంధీకి బ్లూప్రింట్ ఇచ్చారు. దీని అధ్యయనానికి కేసీ వేణుగోపాల్, దిగ్విజయ సింగ్, అంబికా సోని, రణదీప్ సుర్జేవాలా, జైరాం రమేష్, ప్రియాంక గాంధీ వాద్రాలతో సోనియాగాంధీ ప్రత్యేక కమిటీ కూడా వేశారు. కమిటీ తమ అభిప్రాయాల్ని సోనియాతో భేటీలో తెలియజేశారు. నివేదికను సమీక్షించిన అనంతరం సోనియా సభ్యులతో దీనిపై చర్చించారు. భవిష్యత్తులో ఎదురయ్యే రాజకీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు సాధికారత చర్య బృదం-2024 ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ బృందంలో చేరాలని సోనియా గాంధీ ప్రశాంత్ కిశోర్ ను కోరింది. ఈ ప్రతిపాదనను పీకే తిరస్కరించారు.
మొదట్లో ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని పెద్దఎత్తున ప్రచారం సాగింది. కానీ ఊహించన విధంగా ఆయన పార్టీలో చేరడం లేదన్న వార్త గందరగోళానికి నెట్టింది. ప్రశాంత్ కిశోర్ ను కాంగ్రెస్ లో చేర్చుకోవాలంటే ఆయనకు ఓ షరతు విధించాలని ఆ పార్టీ నేతలు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. పీకే పార్టీలో చేరాక మరే ఇతర రాజకీయ పార్టీలకు ఆయన ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయవద్దని, ఎలాంటి సేవలు అందించవద్దని చెప్పినట్లు సమాచారం. ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ దేశంలో పలు పార్టీలకు సేవలు అందిస్తున్నారు.. మరికొన్ని పార్టీలతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ విధించిన షరతుతో ఇప్పుడు ఆయన ఈ పార్టీలన్నింటికీ దూరం కావాల్సిన పరిస్థితి వచ్చింది.
వీటితో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరాలంటే ప్రశాంత్ కిషోర్ సైతం కొన్ని డిమాండ్లను అధిష్టానం ముందు ఉంచినట్లు తెలిసింది. పార్టీలో చేరాలంటే ఉన్నత పదవితో పాటు కేవలం సోనియా గాంధీకి మాత్రమే జవాబుదారీగా ఉంటానని ప్రతిపాదన చేసినట్లు సమాచారం. అలాగే పార్టీలో తన సూచనలు, సలహాలు అమలు చేసేందుకు స్వేచ్ఛ ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. అయితే పీకే ప్రతిపాదనలను కొంతమంది కాంగ్రెస్ సీనియర్ నేతలు త్రీవంగా వ్యతిరేకించినట్లు ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ పార్టీలో పీకే ముద్ర ఎలా కొనసాగుతుందంటూ కొంతమంది నేతలు సోనియా దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. అందుకే పార్టీలో అందరిలో కలిసిపోయి... కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, విజయానికి పనిచేయాలని సోనియా పీకే కు సూచించినట్లు సమాచారం.
అయితే అదే గుంపులో గోవింద మాదిరిగా అందరిలో కలిసి పనిచేయడం కుదరదన్న భావనతో పాటుగా ఎన్నికల వ్యూహకర్తగా పార్టీలకు దూరం కావాల్సి వస్తుందన్న ఆలోచనతోనే ప్రశాంత్ కిశోర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీలో ప్రశాంత్ కిషోర్ (పీకే) చేరతారా.. లేదా అని కొంతకాలంగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెరపడింది. కాంగ్రెస్ పార్టీలో ప్రశాంత్ కిషోర్ చేరడం లేదని తేలిపోయింది. కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదనను పీకే తిరస్కరించారు. త్వరలో ఏర్పాటు చేయనున్న ‘ఎంవర్డ్ యాక్షన్ గ్రూప్-2024’లో చేరాల్సిందిగా పీకేను కాంగ్రెస్ ఆహ్వానించింది. అయితే, ఈ ప్రతిపాదనను పీకే తిరస్కరించారు. పార్టీని ముందుకు నడిపించడంలో తనకు స్వేచ్ఛ ఇవ్వాలని పీకే కోరినట్లుగా, కాంగ్రెస్ అంగీకరించలేదు. దీంతో పీకే కాంగ్రెస్‌లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు.
‘ఎంవర్డ్ యాక్షన్ గ్రూప్-2024’ అనేది రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం కాంగ్రెస్ ఏర్పాటు చేయనున్న పార్టీ టీమ్. కాంగ్రెస్‌లో చేరేందుకు పీకీ నిరాకరించినట్లుగా, ఆ పార్టీ సీనియర్ నేత రణ్‌దీప్ సూర్జేవాలా ట్వీట్ చేశారు. దీంతో ఈ విషయంలో క్లారిటీ వచ్చేసింది. ఇప్పటికే పీకే పలు ప్రాంతీయ పార్టీలకోసం పనిచేస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో టీఆర్ఎస్ కోసం ఆయన పని చేస్తున్నారు.