Terrorists Open Fire at IAF Vehicle in Poonch (Photo Credit: X/@ultimate__d)

Srinagar, May 04: జమ్మూ-కశ్మీర్‌ (Jammu Kashmir)లో ఉగ్రదాడి చోటుచేసుకుంది. ఇక్కడి పూంచ్‌ జిల్లాలోని శశిధర్‌ ప్రాంతంలో భద్రతా బలగాలకు చెందిన కాన్వాయ్‌పై ఉగ్రవాదులు (Terror Attack) ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంతోపాటు మరో దానిపైనా దాడికి దిగారు. ఈ ఘటనలో అయిదుగురు జవాన్లు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని, వారిని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

 

ఈమేరకు సమాచారం అందుకున్న వెంటనే అదనపు బలగాలను ఘటనా స్థలానికి తరలించారు. ఉగ్రవాదులను గుర్తించేందుకు భారీ ఆపరేషన్‌ ప్రారంభించినట్లు చెప్పారు. గత ఏడాది సైన్యంపై వరుస ఉగ్రదాడులు జరిగిన ఈ ప్రాంతంలో ఈ ఏడాదిలో ఇదే మొదటి అతిపెద్ద దాడి.