Ahmedabad, February 24: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన రెండు రోజుల భారత పర్యటన కోసం సోమవారం అహ్మదాబాద్ చేరుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మెలానియా ట్రంప్‌లను సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రధాని నరేంద్ర మోదీ ఘనస్వాగతం పలికారు.
అహ్మదాబాద్‌లో ట్రంప్, మోడీ దినోత్సవ ముఖ్యాంశాలు ఇక్కడ ఉన్నాయి:
* సోమవారం ఉదయం వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఆలింగనం చేసుకొని ఆత్మీయ స్వాగతం పలికారు. భార్య మెలానియా ట్రంప్‌కు నమస్కారం చేశారు..
* ట్రంప్ బ్లాక్ సూట్, పసుపు రంగు టైతో కనిపిస్తుండగా, యుఎస్ ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ తెల్లటి జంప్‌సూట్ ధరించి, ఆకుపచ్చ కండువాను నడుము చుట్టూ ధరించి ప్రకాశవంతంగా కనిపిస్తున్నారు.
* విమానాశ్రయంలో, అమెరికా అధ్యక్షుడి కుమార్తె ఇవాంకా ట్రంప్, తన భర్త జారెడ్ కుష్నర్‌లకు కూడా ఘన స్వాగతం లభించింది.
* ట్రంప్ కు స్వాగతం పలులుతూ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన సంగీతం మరియు నృత్య ప్రదర్శనల మధ్య పిఎం మోడీతో కలిసి ట్రంప్‌లు రెడ్ కార్పెట్ పై నడిచారు.
* విమానాశ్రయం నుండి నేరుగా మహాత్మా గాంధీ సబర్మతి ఆశ్రమానికి వెళ్లారు. సాంప్రదాయ భారతీయ కండువా ధరించిన యుఎస్ మొదటి జంట, మహాత్మా గాంధీ స్వయంగా నూలు వడికిన 'చర్ఖా' ను ఆసక్తిగా తిలకించారు. దాని విశేషాలను తెలుసుకున్నారు.
* సబర్మతి ఆశ్రమంలో తన అనుభవాలను ట్రంప్ అక్కడి సందర్శకుల పుస్తకంపై రాసి, ఆటోగ్రాఫ్ చేశారు.
అనంతరం అక్కడే ఉన్న "మూడు కోతుల" విగ్రహాన్ని ఆసక్తిగా చూశారు. ప్రధాని మోదీ గాంధీజీ మూడు కోతుల సిద్ధాంతాన్ని వివరిస్తుంటే ట్రంప్ సతీమణి మెలానియా సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. వీరి తరువాత ఇవాంకా ట్రంప్ కూడా ఆ ప్రదేశాన్నంతా కలియదిరిగారు.
ఇక్కడి నుంచి ట్రంప్ కాన్వాయ్ నేరుగా అహ్మదాబాద్ లోని మొతెరా స్టేడియానికి బయలుదేరారు. వారికి దారిపొడవునా అహ్మదాబాద్ రోడ్లపై 22 కిలోమీటర్ల వరకు పెద్దసంఖ్యలో జనాలు కేరింతలు చేస్తూ ఉత్సాహంగా స్వాగతం పలికారు.
* మొతెరా స్టేడియం గా ప్రసిద్ది చెందిన సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియం లక్ష మందికి పైగా కూర్చునే సామర్థ్యం కలిగిన ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం. కొత్తగా నిర్మించిన స్టేడియం "నమస్తే ట్రంప్" కార్యక్రమానికి వేదిక.