టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష విషయంలో నిందలు అవాస్తవం, క్లారిటీ ఇచ్చిన టీఎస్పీఎస్సీ జక్కుల సుచిత్ర అనే నిజామాబాద్ యువతి చేస్తున్న దుష్ప్రచారం కమిషన్ నోటీసుకు వచ్చింది. ఆమెతో పాటుగా మీడియాలో వస్తున్న ప్రచారంపై సీరియస్ అయిన టీఎస్పీఎస్సీ కమిషన్ స్టేట్మెంట్ రూపంలో క్లారిటీ ఇచ్చింది. 2023 జూన్ 6న రాయాల్సి ఉన్న గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి తనకు హాల్ టికెట్ వచ్చిందని ఫీజు చెల్లించకుండానే ఇదంతా జరిగిపోయిందంటూ ఆమె చెప్పిన మాటలు పూర్తిగా అవాస్తవమని తేలింది. గతేడాది 16 అక్టోబర్ 2022న సుచిత్ర ఏహెచ్ఎమ్వీ జూనియర్ కాలేజీలో జరిగిన గ్రూప్ 1 పరీక్షకు హాజరైంది. దీనికి సంబంధించిన హాజరుపై ఆమె చేసిన సంతకం కూడా తమ వద్ద ఉందని కమిషన్ పేర్కొంది. టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రీషెడ్యూల్ కావడంతో 2023 జూన్ 11న మరోసారి నిర్వహించారు. ఈ మేరకు గ్రూప్ 1కు గతంలో దరఖాస్తు చేసిన అభ్యర్థులకు మెసేజ్ పంపుతూ అలర్ట్ చేసింది. ప్రెస్ నోట్ విడుదల చేసి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. మెసేజ్ పంపుతూ అలర్ట్ చేసింది. ప్రెస్ నోట్ విడుదల చేసి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది.
టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష విషయంలో నిందలు అవాస్తవం, క్లారిటీ ఇచ్చిన టీఎస్పీఎస్సీ
జక్కుల సుచిత్ర అనే నిజామాబాద్ యువతి చేస్తున్న దుష్ప్రచారం కమిషన్ నోటీసుకు వచ్చింది. ఆమెతో పాటుగా మీడియాలో వస్తున్న ప్రచారంపై సీరియస్ అయిన టీఎస్పీఎస్సీ కమిషన్ స్టేట్మెంట్ రూపంలో క్లారిటీ ఇచ్చింది.… pic.twitter.com/ZXfkxc8WM9
— Telugu Scribe (@TeluguScribe) June 12, 2023