Bird Flu. (Photo Credit: IANS | X)

ప్రమాదకరమైన హెచ్‌5ఎన్2 బర్డ్ ఫ్లూతో తొలి మానవ మరణం సంభవించింది. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారికంగా నిర్ధారించింది. డబ్లూహెచ్‌వో ప్రకటన ప్రకారం మెక్సికోకు చెందిన ఓ 59 ఏళ్ల వ్యక్తి ఈ హెచ్‌5ఎన్2 వైరస్ బారిన పడి మృతి చెందాడు. అయితే సదరు వ్యక్తి ఏ విధమైన యానిమల్ కాంటాక్ట్‌లో లేకపోయినా ఈ వైరస్ సోకి మరణించాడని డబ్లూహెచ్‌వో ప్రకటించడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది.

వివరాల్లోకి వెళితే.. మృతుడు అంతకుముందు నుంచే ఆనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలిపిన డబ్లూహెచ్‌వో.. ఏప్రిల్‌లో అతడిలో బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించడంతో వెంటనే ఆసుపత్రిలో చేర్చడం జరిగిందని, అయితే దాదాపు వారం రోజుల చికిత్స అనంతరం అదే నెల 24వ తేదీన అతడు మరణించాడని వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే అతడితో కాంటాక్ట్‌లో ఉన్న మరో 17 మందిని కూడా డబ్లూహెచ్‌వో పరీక్షించి వారిలో ఒకరిలో వైరస్ లక్షణాలు స్వల్పంగా ఉన్నట్లు నిర్ధారించింది.  బీపీ పేషెంట్లు ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఈ 6 ఆహరాలను తీసుకుంటే...మీ బీపీ ఎప్పటికి అదుపులో ఉంటుంది...

కాగా.. బర్డ్ ఫ్లూ అనేది ఇన్‌ఫ్లూఎంజా వైరస్ జాతికి చెందిన ఓ ప్రమాదకరమైన వైరస్. ఇది ముఖ్యంగా పక్షుల్లో ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. వాటి మరణానికి కారణమవుతుంది. అయితే ఇది మనుషులకు కూడా సంక్రమించి తీవ్ర అనారోగ్యాలకు గురిచేస్తూ వచ్చింది. ఈ క్రమంలో ఈ వైరస్ వల్ల తొలి మరణం సంభవించడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది.