Newdelhi, Oct 17: స్వలింగ సంపర్కుల వివాహాలకు (Verdict on Gay Marriage) చట్టబద్ధత కల్పించాలంటూ దాఖలైన పిటిషన్‌లపై భారత సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) మంగళవారం తీర్పు వెలువరించనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ పిటిషన్లపై మే 11న తీర్పు రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. అంతకుమునుపు, సుప్రీం కోర్టులో వరుసగా పదిరోజుల పాటు వాదోపవాదాలు సాగాయి. ప్రధాన న్యాయమూర్తితో పాటూ ధర్మాసనంలోని మిగతా జడ్జీలు వాదనలు సావధానంగా విన్నారు. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించడం ఈ దశలో సరైన నిర్ణయం కాజాలదని కేంద్రం అభిప్రాయపడింది. ఈ నిర్ణయంతో రాబోయే పరిణామాలను అంచనా వేయడం, ఎదుర్కోవడం సాధ్యం కాకపోవచ్చని పేర్కొంది.
Will India recognise same-sex marriage? Supreme Court to decide today
(Reports @utkarsh_aanand) https://t.co/vq1ZuZhXFK pic.twitter.com/ojzKZ4XHr5
— Hindustan Times (@htTweets) October 17, 2023
రాష్ట్రాలు ఏమన్నాయంటే?
ఈ అంశంపై కొన్ని రాష్ట్రాలు తమ అభిప్రాయాలు తెలిపినట్టు కేంద్రం కోర్టులో వెల్లడించింది. రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, అస్సాం ప్రభుత్వాలు స్వలింగ వివాహాల చట్టబద్ధతను వ్యతిరేకించాయని పేర్కొంది. మరోవైపు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మణిపూర్, సిక్కిం మాత్రం నిర్ణయం తీసుకునేందుకు మరింత సమయం కోరాయని చెప్పింది.
Viral Video: ‘గణపతి బప్పా మోరియా’తో మారుమోగిన ఎకానా క్రికెట్ స్టేడియం.. ఆస్ట్రేలియా ఫ్యాన్ హల్ చల్