CM YS Jagan (Photo-Twitter/AP CMO)

చిత్తూరు, మార్చి 27 :  చిత్తూరు జిల్లాలో శుభకార్యానికి వెళుతున్న ట్రావెల్స్ బస్సు లోయలో పడి ఎనిమిది అక్కడిక్కడే మృతిచెందగా మరో 54మంది గాయపడ్డారు. శనివారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘోర ప్రమాదం గురించి తెలియడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. వెంటనే అధికారులకు ఈ ఘోర ప్రమాదంపై ఆరా తీసారు. ఈ సందర్భంగా ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50వేల చొప్పున ఆర్థికసాయం అందిచనున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు.

ఇక ప్రమాదానికి గల కారణాలు, సహాయక చర్యల గురించి అధికారులు సీఎంకు వివరించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు... ప్రత్యేక బృందాలతో, ఫైర్ సిబ్బంది సహాయంతో సహాయక చర్యలను వేగవంతం చేసినట్లు తెలిపారు. స్వయంగా జిల్లా కలెక్టర్, ఎస్పీ ఈ సహాయక చర్యలను పర్యవేక్షించినట్లు అధికారులు సీఎం కు వివరించారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికూడా ఈ సహాయక చర్యల్లో పాల్గొన్నట్లు సీఎంకు తెలుసుకున్నారు.

Aadhi Engaged to Nikki Galrani: ఆ హీరో, హీరోయిన్ల పెళ్లి ఖరారు! ఓ ఇంటివాడు కాబోతున్న ఆదిపినిశెట్టి, అట్టహాసంగా ప్రియురాలితో నిశ్చితార్ధం, అక్కకు పెళ్లికాకుండానే మ్యారేజ్ చేసుకుంటున్న కన్నడ బ్యూటీ

క్షతగాత్రులను తిరుపతిలోని స్విమ్స్, రుయా, బర్డ్‌ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నామన్నట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించాలని... బాధితులు కోలుకునేంతవరకూ అండగా నిలవాలని అధికారులను సీఎం  జగన్ ఆదేశించారు.