(Photo Credits: Pixabay)

సమాజంలో రోజురోజుకు మానవ విలువలు నశిస్తున్నాయి. ముఖ్యంగా క్షణ సుఖం కోసం తొందరపడి కొందరు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వివాహేతర సంబంధాల్లో ఇలాంటి ఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. కన్న కూతురుకి ఓ తల్లి ద్రోహం చేసిన ఘటన ఒరిస్సాలో కలకలం రేపుతోంది. కూతురుకు తాళి కట్టిన అల్లుడితో అత్తగారు తన పడక సుఖాన్ని పొందాలని కోరుకుంది. కూతురు జీవితం నాశనం అయిపోయిన తనకేమీ పట్టనట్టు వ్యవహరించింది. అంతే కాదు కూతురిని ఇంటి నుంచి గెంటివేసి అల్లుడితో కలిసి రాసలీలలు కంటిన్యూ చేయాలని ఆశపడింది. కానీ సభ్య సమాజం ఆగ్రహించింది.

వివరాల్లోకి వెళితే ఒడిశాలోని జేపూర్ గ్రామంలో నివసించే సునీత ( పేరుమార్చాం) తన కుమార్తె పింకీ ( పేరు మార్చాం)తో కలిసి జీవిస్తోంది. ఆమె భర్త పదేళ్ల క్రితం ఓ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. కూతురుని తన సమీప బంధువైన రాజేష్ ( పేరు మార్చాం)కు ఇచ్చి వివాహం చేసింది. అయితే కూతురు కాపురం చల్లగా సాగిపోతున్న వేళ ఆమె కాపురంలో నిప్పులు పోయాలని సునీత ప్లాన్ చేసింది. భర్త చనిపోయి పదేళ్లు అయినా తన వయస్సు వేడి ఇంకా చల్లారలేదని గ్రహించింది. ఎలాగైనా శారీరక సుఖాలను అనుభవించాలని, దుర్బుద్ధితో తన అల్లుడిపై కన్ను వేసింది. అనుకున్నదే తడవుగా, అతడిని తన మత్తులో దించింది. కూతురు ఇంట్లో లేని సమయంలో అల్లుడిలో కామ కోరికలను రెచ్చగొట్టింది.

సునీత ఉచ్చులో అల్లుడు పూర్తిగా పడిపోయాడు. భార్యను సైతం లెక్కచేయకుండా సునీతతో శారీరక సంబంధం పెట్టుకుంటాడు. భార్య పింకీ బయటకు వెళ్లడమే ఆలస్యం అత్తగారైన సునీత గదిలోకి దూరి ఇద్దరు వయసు కోరికలను తీర్చుకోవడం ప్రారంభించారు. ఓ రోజు సునీత తన అల్లుడితో కలిసి రాస క్రీడల్లో మునిగి తేలుతున్న సమయంలో కిటికీలోంచి కూతురు పింకీ చూసి షాక్ తిన్నది. నా కాపురాన్ని ఎందుకు నాశనం చేస్తున్నావని తల్లిని నిలదీసింది. అందుకు తల్లి ఇందులో తప్పేమీ లేదు, మీ నాన్న అర్థాంతరంగా చనిపోవడంతో నా కోరికలు ఏవి తీరలేదని, అల్లుడు మనింటి వ్యక్తి కాబట్టి అతనితో నా పడక సుఖాన్ని తీర్చుకుంటున్నాను. ఇందులో తప్పేమీ లేదని చాలా మామూలుగా సమాధానం చెప్పింది.

Florida Shocker: క్లాసురూంలో స్టూడెంట్‌తో కలిసి నగ్నంగా కామదాహం ...

కన్నతల్లి తన కాపురంలో చిచ్చు పెట్టడం చూసి పింకీ కుమిలి పోయింది. తల్లిని మందలించినప్పటికీ ఏమాత్రం మార్పు లేకుండా పోయింది. వీలైతే నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపో అని సునీత పింకీని రివర్స్ లో బెదిరించింది. ఇక చేసేదేమీ లేక పింకీ ఓ ప్లాన్ వేసింది. తన భర్త, తల్లి సునీత ఇద్దరు కామకోరికలు తీర్చుకుంటున్న సమయంలో బయట నుంచి తాళం పెట్టి పింకీ చుట్టుపక్కల వారిని పిలిచి గొడవ చేసింది. ఊరి జనాలు అంతా కలిసి సునీతను అలాగే అల్లుడు రాజేష్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గ్రామస్తులంతా ఇద్దరినీ దేహ శుద్ధి చేయడం ప్రారంభించారు. ఇంత చేసి పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.