వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లోనే మంచాన్ని ఏ దిశలో ఉంచాలి అనేది కూడా ఉంటుంది. ఒక్కసారి మంచం దిశలో మార్పుల వల్ల కూడా అది అనేక రకాల ఇబ్బందులను తీసుకువస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం మంచం తో సహా ప్రతి విషయంలో కూడా శుభశుభ ఫలితాలు ఉంటాయి. అయితే మీరు మంచాన్ని ఏ దిక్కులో వేయాలో తెలుసుకోవడం మంచిది. లేకపోతే జీవితంలో అనేక నష్టాలను ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.
మంచం ఉంచడానికి సరైన స్థలం- వాస్తు ప్రకారం మంచం ఎల్లప్పుడూ కూడా ఈ గోడకు తాకకూడదు. గోడకు, మంచానికి కనీసం 6 అంగుళాల గ్యాప్ ఉండడం మంచిది. దీని వల్ల శుభ్రం చేయడానికి కూడా సులభంగా ఉంటుంది. అంతేకాకుండా దీనివల్ల సానుకూల శక్తి ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఎటువంటి విభేదాలు రావు.
Vastu Tips: వాస్తు ప్రకారం ఇంట్లో ఈ దిక్కులో అద్దం పెడితే, అశుభం
ఏ దిశలో మంచాన్ని ఉంచాలి- ముఖ్యంగా ఇంట్లో మంచం వేయడానికి సరైన దిశ ఏదో మనం తెలుసుకోవాలి. వాస్తు ప్రకారం పడకగదిని ఎల్లప్పుడూ కూడా ఇంటికి నైరుతి దిశలో ఉంచాలి. మీ పాదాలను ఎప్పుడు కూడా ఉత్తరం వైపున ఉంచేలాగా చూసుకోవాలి. అలాంటప్పుడు మంచం పాదాలు ఎప్పుడు కూడా దక్షిణం వైపు పెట్టి నిద్రించకూడదు. కాబట్టి మీరు ఇటువంటి తప్పులు గనుక చేసినట్లయితే వాటిని సరిదిద్దుకోవడం వల్ల అనేక రకాల ఇబ్బందుల నుంచి బయటపడతారు.
ఏ దిశలో నిద్రపోవాలి- మీ మంచంలో రాత్రి పడుకునే ముందు దక్షిణం లేదా పడమర వైపు తలను ఉంచడం మంచిది. పొరపాటున కూడా మీ తలను ఉత్తరం వైపు ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల నిద్ర పైన ప్రభావం చూపడం మాత్రమే కాకుండా జీవితం పైన కూడా అనేక రకాల ప్రతికూల ప్రభావాలను కలిగి ఉంటుంది. ఆరోగ్యం క్షీణిస్తుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.