ఈసారి దీపావళికి ఒక ప్రత్యేకమైన సందర్భం ఉంది. 500 సంవత్సరాల తర్వాత దీపావళి రోజు శని ,గురు గ్రహాలు మహాయోగాన్ని సృష్టిస్తాయి. ఈ రెండు గ్రహాల కలయిక యాదృచ్ఛికంగా కొంతమందికి అనేక రకాల ప్రయోజనాలను కలిగిస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం దీపావళికి చాలా ప్రత్యేకత ఉంది. శని గురు గ్రహాల కలయిక వల్ల అనేక లాభాలు వస్తాయి. ఆ మూడు రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి- మేషరాశి వారికి గురుడు మరి శని కలయిక వల్ల గొప్ప ప్రయోజనాలు కలిగి ఉన్నాయి వ్యాపారంలో పురోగతి ఉంటుంది వివాహం కాని వారికి వివాహాలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. విద్యార్థులు పోటీపరీక్షల్లో ఉత్తీర్ణుల అవుతారు వ్యాపారంపరంగా ఆర్థిక లాభాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ కోసం విదేశాల్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటారు. ఇది లాభాలను తీసుకువస్తుంది. ప్రైవేట్ ఉద్యోగం చేసే వారికి బోనస్లో వస్తాయి. ఉద్యోగం చేసే వారికి ప్రమోషన్ లభిస్తుంది. కోరుకున్నచోట బదిలీలు అవుతాయి.
Vastu Tips: వాస్తు ప్రకారం బెడ్రూంలో మంచం ఏ దిశలో ఉండాలి,
వృషభరాశి- వృషభ రాశి వారికి ఈ దీపావళి రోజున చాలా శుభప్రదంగా ఉంటుంది. వీరికి ఆనందం విలాసాలు పెరుగుతాయి సమయానికి డబ్బు అందుతుంది. ఎప్పటినుంచో కొనాలి అనుకుంటున్నా కొత్త కారు ఇల్లు ఆస్తులను కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలలో పెట్టుబడులు లాభాలను తీసుకువస్తాయి. వ్యాపార విస్తరణ మీరు ఇది చాలా శుభ సమయం. విద్యార్థులు విదేశాల్లో చదువుకోవడానికి ఆసక్తి పెరుగుతుంది. ఎప్పటినుంచో ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు. దీనివల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలకు వెళతారు.
మీన రాశి- శని ,గురు గ్రహాల కలయిక వల్ల ఈ రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు పెరుగుతాయి. మీరు ఆశించిన ధనం అందుతుంది. కొన్నిసార్లు ఆకస్మికంగా డబ్బు మీ చేతికి వస్తుంది. దీనివల్ల సమాజంలో పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. వ్యాపారంలో పెద్ద పెద్ద కాంట్రాక్టులు పొందుతారు. ఉద్యోగం చేసే వారికి పదోన్నతి లభిస్తుంది. దీనివల్ల మీకు గౌరవం పెరుగుతుంది. ప్రేమ వివాహాలకు అనుకూలం మీ ప్రేమ వివాహాలకు కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది. జీవిత భాగస్వామితో కలిసి ఏకాంతంగా గడుపుతారు. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు కోర్టు సమస్యల నుండి బయటపడతారు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.