Image credit - Pixabay

మేషం: ఈ రాశి వారికి వ్యాపారంలో లాభాలు అందుకుంటారు.  ఉద్యోగస్తులు  శుభవార్తలు వినే అవకాశం ఉంది. విద్యార్థులు కూడా పోటీ పరీక్షల్లో విజయం సాధించే వీలుంది.  ముఖ్యంగా పెళ్లి కాని యువతీ యువకులు కళ్యాణ ఘడియలు వచ్చే అవకాశం కనిపిస్తోంది.  విదేశాల్లో వ్యాపారం చేసే వారికి ఈ కాలం బాగా కలిసి వస్తుంది లక్ష్మీదేవి కటాక్షంతో మీరు మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది. వైద్య వృత్తిలో ఉన్నవారు అద్భుతంగా రాణిస్తారు వీరి ఆదాయం రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారు కూడా మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది.  సాఫ్ట్ వేర్ రంగంలో పని చేసేవారు  కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవకాశముంది.  కిరాణా వ్యాపారం చేసేవారు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఆసన్నం అయింది.  దగ్గర వారి చేతిలో మోసపోయే అవకాశం ఉంది కావున డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి.  అలాగే ప్రతి సోమవారం శివాలయం వెళ్లి ఆవు నెయ్యితో దీపం వెలిగించి ఓం నమశ్శివాయ మంత్రం జపిస్తూ 11 సార్లు గుడి చుట్టూ ప్రదక్షిణ చేయాలి.

మిథునం:  ఈ రాశి వారు ఆస్తుల విషయంలో అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంది.  కోర్టులో పెండింగ్లో ఉన్న కేసులు క్లియర్ అవడంతో పాటు,  అనేక శుభవార్తలు వినే అవకాశం ఉంది.  వ్యాపార పరంగా ఈ రాశుల వారు చక్కటి అభివృద్ధి సాధిస్తారు.  కొత్త వ్యాపారం ప్రారంభించే వారికి ఈ కాలం బాగా కలిసి వస్తుంది.  అంతే కాదు ఈ రాశుల వారు  వివాహ ప్రయత్నాలు  ఆశించిన స్థాయిలో విజయవంతం కావు.  విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశం ఉంది.  క్రీడాకారులకు ఈ వారం చాలా చక్కగా కలిసి వస్తుంది.  ఇక వైద్య వృత్తిలో ఉన్నవారికి ఇది చాలా గడ్డు కాలం  కాస్త ఏమరపాటుగా ఉన్న మీ కెరీర్ దెబ్బతీయ అవకాశం ఉంది.  విదేశాల్లో ఉద్యోగ వ్యాపారాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మీ కెరీర్ దెబ్బ తినే అవకాశం ఉంది.  కిరాణా షాపు నడుపుకునే వారికి  మంచి వ్యాపారం జరిగే అవకాశం ఉంది.  అలాగే పాల వ్యాపారం చేసే వారు కూడా చక్కటి అభివృద్ధి సాధిస్తారు.  ప్రతి గురువారం  దుర్గాదేవి గుడికి వెళ్లి  11 ప్రదక్షిణలు చేసినట్లయితే  మీరు తలపెట్టిన పనిలో విజయం సాధిస్తారు.

సింహం:  ఈ రాశి వారు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కాస్త ఏమరపాటుగా ఉన్నా,  మీరు వ్యాపారంలో నష్టపోయే అవకాశం ఉంటుంది.  కూరగాయల వ్యాపారం చేసేవారు  చాలా జాగ్రత్తగా ఉండాలి.  లేకపోతే నష్టపోయే అవకాశం ఉంది.  అంతేకాదు వైద్య వృత్తిలో ఉన్నవారు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవకాశం ఉంది.  విదేశాల్లో ఉద్యోగ వ్యాపారాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాల్సిన అవకాశం ఉంది లేకపోతే వీరు ప్రమాదంలో పడే అవకాశం ఉంది.  దీంతోపాటు ప్రభుత్వ ఉద్యోగులు గుడ్ న్యూస్ వినే అవకాశం ఉంది.   వైవాహిక జీవితంలో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాల్సిన అవకాశం ఉంది లేకుంటే అనవసరంగా గొడవలు పెట్టుకునే వీలుంది.  సంతానం విషయంలో శుభవార్తలు వింటారు.  ప్రతి శనివారం నవగ్రహాల్లోని శని విగ్రహం ముందు నువ్వుల దీపం వెలిగించి నవగ్రహాల చుట్టూ 11 ప్రదక్షిణలు చేయాలి.

Vastu Tips: వాస్తు ప్రకారం ఇంటికి ఎన్ని ద్వారాలు ఉండాలి

తుల: ఈ రాశి వారు ఉద్యోగంలో ప్రమోషన్లను పొందే అవకాశం ఉంది అలాగే వేతనం కూడా పెరిగే వీలుంది.  నూతనంగా వ్యాపారం ప్రారంభించే వారికి ఈ కాలం బాగా కలిసి వస్తుంది.  సతానం విషయంలో ఈ రాశి వారు శుభవార్తలు వింటారు.  వివాహ ప్రయత్నాలు ప్రారంభించిన టువంటి యువతి యువకులు శుభవార్త వినే అవకాశం ఉంది.  పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తవడం ద్వారా వీరు అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయవంతం అవుతారు.  రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారం చేసేవారు నేడు విజయం సాధించే అవకాశం ఉంది.  పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి అవ్వడం ద్వారా  ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసేవారు మంచి ప్రమోషన్ పొందే వీలుంది.  శనివారం  రావి చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేయాలి.