Dhanteras Wishes in Telugu (2)

దీపావళికి ముందున ధన్ తేరస్ వస్తుంది. ఇది అనేక రకాల ఆచారాలను కలిగి ఉంటుంది. అయితే ప్రజలు దీపావళి  ధన్ తేరస్ సమయంలో అనేక రకాల వస్తువులు ఇంటి కోసం కొంటూ ఉంటారు. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి చాలా పవిత్రమైన రోజు ఈ రోజు కొన్ని వస్తువులు తీసుకోవడం ద్వారా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పటికీ మీ పైన ఉంటుంది. ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

బంగారం- బంగారం కొనడం వల్ల ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీ పైన ఎప్పటికీ ఉంటుంది. ఈరోజు బంగారం తీసుకువచ్చి ధన్వంతరి దేవుడికి పూజిస్తారు. సంపద అదృష్టం ఆరోగ్యం కోసం లక్ష్మీదేవిని పూజిస్తారు. మీకు వీలైనంతవరకు కొంచమైనా సరే బంగారాన్ని  ధన్ తేరస్ రోజు తీసుకుంటే మీకు అదృష్టం కలిసి వస్తుంది.

Vastu Tips: మీ బెడ్ రూం నుండి ఈ 5 వస్తువులను వెంటనే తొలగించండి ...

రాగి- బంగారం కొనలేని వారు రాగి పాత్రలు కూడా తీసుకున్నట్లయితే ఇది కూడా మీకు శుభప్రదంగా ఉంటుంది. దంతేరెస్ రోజు రాగి పాత్రలో ఆహారం తీసుకోవడం ద్వారా లేదా నైవేద్యాలు పెట్టడం కూడా లక్ష్మీదేవికి ఎంతో శుభకరం. రాగి పాత్రలను మీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. రాగి పాత్రలు కొనుక్కున్నట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం మీ పైన ఎప్పటికీ ఉంటుంది.

తులసి మొక్క-హిందూమతంలో తులసి మొక్కకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అంతే కాకుండా తులసిలో ఆయుర్వేదిక గుణాలు కూడా అధికంగా ఉంటాయి. ధన్ తేరస్ రోజు ఈ మొక్కను కొనుగోలు చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా మీ ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. తులసి మొక్కను తీసుకొని వచ్చి పూజ చేసి అక్కడ దీపం వెలిగించినట్లయితే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పటికీ మీపై ఉండి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.