astrology

ఈ సంవత్సరం అక్టోబర్ 3 నుండి నవరాత్రులు ప్రారంభమవుతాయి. అక్టోబర్ 3 నుండి అక్టోబర్ 11 వరకు 9 రోజులు పూర్తవుతాయి. అక్టోబర్ 12న విజయదశమి జరుపుకుంటారు. ఈ తొమ్మిది రోజుల్లో కూడా ఆ దుర్గాదేవిని పూజిస్తారు. అయితే దుర్గాదేవిని పూజించే ముందు మన ఇంట్లో కొన్ని వస్తువులను తీసేయాలి. ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంటిని శుభ్రం చేసుకోవాలి- నవరాత్రుల ప్రారంభానికి ముందే ఇంట్లో ఇంటిని శుభ్రపరచుకోవాలి. ఇంట్లో మద్యం, వెల్లుల్లి, ఉల్లిపాయ మాంసం వంటి వస్తువులను తీసివేయాలి. వీటిని తీసివేయడం ద్వారా దుర్గామాత అనుగ్రహాన్ని పొందుతారు.

Astrology: గురువారం లక్ష్మీదేవికి ఇలా పూజ చేస్తే మీరు కోటీశ్వరులు

విరిగిన వస్తువులు- ఇంట్లో పాత పాత్రలు విరిగిన సామాన్లు ఏమైనా ఉంటే అవి మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని పెంచుతాయి. దీనివల్ల మన ఇంట్లో పేదరికం, అనారోగ్యం పెరుగుతాయి. దుర్గామాతకు ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉండాలి. ఇలా ఉండడం వల్ల ఆ దుర్గామాత అనుగ్రహం పొంది సంపద పెరుగుతుంది.

చిరిగిన బట్టలు- మన ఇంట్లో చిరిగిన బట్టలు ఏమైనా ఉంటే నవరాత్రులలోపు తీసివేయాలి. ఇది ఇంట్లో చెడు శక్తులను పెంచుతుంది. దీని ద్వారా దరిద్ర దేవత ఇంట్లోకి వస్తుంది. కాబట్టి వీటిని తీసివేయడం ద్వారా మీకు ఐశ్వర్యం లభిస్తుంది.

దేవుడి విరిగిన విగ్రహం లేదా పగిలిన ఫోటోలు- నవరాత్రికి ముందే దేవుని గదిలో ఉన్న ఏమైనా విరిగిన విగ్రహాలు లేదా దేవుని పటాలు పలికినవి ఏమన్నా ఉంటే వాటిని తీసివేయాలి. వీటిని ప్రవహించే నీటిలో వేయాలి. కొత్త విగ్రహం లేదా కొత్త ఫోటో తెచ్చి మళ్ళీ ప్రతిష్టించుకోవాలి. దీని ద్వారా దుర్గామాత అనుగ్రహం ఉంటుంది.

బొగ్గులు- చాలామంది ఇళ్లల్లో కట్టెలు కాల్చిన బొగ్గులను ఉంచుతారు. ఇవి ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో ఉంచకూడదు దీనివల్ల దేవునికి కోపం వస్తుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.