జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, అన్ని గ్రహాలు ఒక నిర్దిష్ట సమయంలో తమ రాశిని మార్చుకుంటాయి. గ్రహాల రాశిచక్రాల మార్పు విశ్వంలోని అన్ని జీవులపై శుభ , అశుభ ప్రభావాలను కలిగిస్తుంది . మే నెలాఖరున అంటే 31 మే నుంచి గ్రహాల రాకుమారుడైన బుధుడు, గురుడు ఇంట్లోకి ప్రవేశం .గురుడు ఇంట్లోకి, బుధుడు ప్రవేశించిన వెంటనే కొన్ని రాశుల వారి జీవితాల్లో ఆకస్మిక మార్పులు వస్తాయి. కెరీర్ నుండి ఆర్థిక సమస్యల వరకు సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది . కాబట్టి ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం.
మేషరాశి: మేష రాశి వారికి బుధ సంచారము ఖర్చులతో నిండి ఉంటుంది. మిత్రుల మధ్య ఖర్చులు పెరగవచ్చు . మీరు ఖర్చుల కారణంగా ఒత్తిడికి గురవుతారు. అయితే, మీరు కూడా డబ్బు సంపాదిస్తారు. కానీ ఖర్చులు కూడా విపరీతంగా ఉంటాయి. మీ ఖర్చులను నియంత్రించుకోండి లేకపోతే మీరు అతి త్వరలో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవచ్చు.
మిధునరాశి: మిథున రాశి వారికి బుధ సంచారం అంత అనుకూలంగా ఉండదు. బుధ సంచారము వలన మిథున రాశి వారికి ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉండవచ్చు. అనారోగ్యం వల్ల చాలా డబ్బు ఖర్చు అవుతుంది. ఆర్థిక సంక్షోభం సమస్య ఉండవచ్చు. మీరు కుటుంబం నుండి కొత్త బాధ్యతలను పొందవచ్చు . మీ బాధ్యతలను నెరవేర్చడానికి మీరు ఎవరి దగ్గరైనా అప్పు తీసుకోవలసి రావచ్చు.
సింహరాశి: జ్యోతిషశాస్త్రం ప్రకారం, సింహ రాశి వారికి బుధ సంచారము శుభప్రదం కాదు . ఎందుకంటే ఈ సమయంలో సింహ రాశి ఉన్నవారు వ్యాపారంలో అధిక ఖర్చులు, నష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది. దీని కారణంగా మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టిన వ్యక్తులు నష్టపోవచ్చు. మొత్తంమీద, బుధుని సంచారం ఆర్థిక విషయాలకు అనుకూలంగా ఉండదు.
వృశ్చిక రాశి: జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం, గురు ఇంట్లో బుధుడు సంచరించడం ఆర్థిక నష్టాన్ని తెస్తుంది. వృశ్చిక రాశి వారు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎటువంటి ప్రయాణాలకు దూరంగా ఉండాలి. మీరు స్నేహితులతో కలిసి పార్టీకి వెళితే, డబ్బు విషయంలో మరింత జాగ్రత్తగా ఉండండి. పెట్టుబడికి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి.
తులారాశి: తుల రాశి వారికి బుధుని సంచారం మంచి ఫలితాలను తీసుకురాదు. ఈ కాలంలో తుల రాశి వారు ప్రయాణాలకు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. మీరు ఖర్చుల కారణంగా ఒత్తిడికి గురవుతారు. ఆర్థిక అవరోధాల వల్ల మనస్సు ఇబ్బంది పడవచ్చు. స్నేహితులతో ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. డబ్బు ఆదా చేయడంపై ఎక్కువ శ్రద్ధ వహించండి.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.