జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సంపదకు కలలకు కారణమైన గ్రహం శుక్ర గ్రహం. శుక్ర గ్రహం అక్టోబర్ 5 నుండి 13వ తేదీ వరకు గురుడు ,శుక్రుడు ఒకే రాశిలోకి ప్రవేశిస్తారు. ఒకేసారి రెండు గ్రహాలు ప్రవేశించడం ద్వారా అనేక విశేష ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ మూడు రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కన్యా రాశి- కన్య రాశి వారికి రెండు గ్రహాలు ఒకే రాశుల ఒకే కలయిక వల్ల అనేక శుభ ఫలితాలు పొందుతారు. వీరిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగం చేసే చోట మీకు గౌరవం పెరుగుతుంది. మీ పై అధికారులకు నుండి మీకు మద్దతు లభిస్తుంది. దీనికి కారణంగా మీ లక్ష్యాలను మీరు తొందరగా సాధిస్తారు. విద్యార్థులు ఏకాగ్రతతో కోరుకున్న ర్యాంకును తెచ్చుకుంటారు. దాని ఫలితంగా మీకు విదేశాల్లో చదువుకునే అవకాశం లభిస్తుంది. వ్యాపారస్తులకు ఆదాయం పెరుగుతుంది. నూతన వాహనాన్ని కొనుగోలు చేయాలనుకున్న కళ నెరవేరుతుంది ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి.
Vastu Tips: తులసి మొక్కను ఈ ఒక్క రోజు మాత్రమే ఇంటికి తెచ్చుకోవాలి ...
కుంభరాశి- ఈ రాశి వారికి శుక్రుడు ,గురు గ్రహ సంచారం కారణంగా చేపట్టిన ప్రతి పని కూడా శుభ ఫలితాలను ఇస్తుంది. వ్యాపారులకు పాత బకాయిలు తిరిగి రావడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ప్రమోషన్ వల్ల మీ జీతం కూడా పెరిగే అవకాశం ఉంది. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య ఎప్పటినుంచో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా గడుపుతారు. ప్రేమ వివాహాలకు అనుకూలం.
మీన రాశి- మీన రాశి వారికి కూడా శుక్రుడు ,గురుడు సంచారం కారణంగా అదృష్టం కలిసి వస్తుంది. వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులను పెడతారు. దీని ద్వారా ఆర్థికంగా లాభాలు వస్తాయి. విద్యార్థులు మంచి మార్కులతో మొదటి స్థానంలో ఉత్తీర్ణులు అవుతారు. దీని ద్వారా తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారు. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు ఎప్పటినుంచో కోట్ల పెండింగ్లో ఉన్న సమస్య తీరిపోతుంది. దీని ద్వారా మానసికంగా ప్రశాంతంగా ఉంటారు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.