astrology

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సంపదకు ఐశ్వర్యానికి సుఖాలకు విలాసాలకు అధిపతి అయిన శుక్రుడు రాశి మార్పు వల్ల అనేక ప్రయోజనాలు పొంది ఉంటాడు. అక్టోబర్ 16 నుండి అనురాధ నక్ష విశాఖ నక్షత్రం నుండి అనురాధ నక్షత్రంలోనికి ప్రవేశిస్తాడు. ఇది అక్టోబర్ 27 వరకు ఉంటుంది. ఈ శుక్రుని సంచారం కారణంగా అన్ని రాశుల వారికి ప్రభావితం ఉంటుంది. ముఖ్యంగా ఈ మూడు రాశుల వారికి చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఆ మూడు రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి- అనురాధ నక్షత్రం లోనికి శుక్రుని సంచారం కారణంగా ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. వీరి ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. దీని ద్వారా మీ ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు తగ్గుతాయి. మీ ప్రతిపకు తగ్గట్టుగా ప్రశంసలు పొందుతారు. వ్యాపారాల్లో కొత్త అవకాశాలు లభిస్తాయి. మీ వ్యాపార సంబంధాలు బలపడతాయి విద్యార్థులు చదువు పైన ఆసక్తిని చూపిస్తారు. వారి లక్ష సాధనలో విజయాన్ని సాధిస్తారు. కుటుంబ జీవితం ఆనందకరంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలకు వెళతారు.

Vastu Tips: తులసి మొక్కను ఈ ఒక్క రోజు మాత్రమే ఇంటికి తెచ్చుకోవాలి ...

మీన రాశి- మీన రాశి వారికి అనురాధ నక్షత్రంలోనికి శుక్రియ సంచారం కారణంగా వీరికి అనేక ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ముఖ్యంగా ఖర్చులు తగ్గడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ప్రతికూల సంఘటనల్లో కూడా ధైర్యంగా ఉంటారు. ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది. దీని వల్ల మీ కార్యాలయంలో మీ ప్రభావం పెరుగుతుంది. మీరు చేసిన కృషి ఫలిస్తుంది సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఆకస్మికంగా ధన లాభం పొందుతారు. పూర్వీకుల నుండి ఆస్తి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపార విస్తరణకు ఇది అనువైన సమయం కొత్త పట్టుబడులు పెట్టడానికి డబ్బులు లభిస్తుంది. మీరు వ్యాపార పరంగా చేసే ప్రయాణాలు లాభాన్ని ఇస్తాయి పాత అప్పులు తీరుతాయి.

కన్యా రాశి- కన్యా రాశి వారికి శుక్రుడు అనురాధ నక్షత్రంలోనికి సంచరించడం వల్ల ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. కొత్త కొత్త ఆదాయం మార్గాలు వస్తాయి. పాత పెట్టుబడుల నుండి లాభాలు వస్తాయి.ఉద్యోగంలో ప్రమోషన్ లభించడం వల్ల మీ జీతం రెట్టింపు అవుతుంది. ఆఫీసుల్లో మీ ప్రశంస మీ ప్రతిభకు తగ్గట్టుగా ప్రశంసలు పొందుతారు. దీని వల్ల మీ బాధ్యత కూడా పెరుగుతుంది. కొన్ని ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేస్తారు. దీని ద్వారా యజమాని నుండి ప్రశంసలు పొందుతారు. కొత్త కస్టమర్ల రాకతో మీ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.