జ్యోతిష శాస్త్రం ప్రకారం బుధుడు చాలా వేగవంతమైన గ్రహం బుధ గ్రహం. తెలివితేటలకు కమ్యూనికేషన్ కి వ్యాపారానికి కారణమైన గ్రహం అయితే సెప్టెంబర్ నెలలో ఈ బుధుడు రెండుసార్లు తమన్న రాశిని మార్చుకుంటుంది. సెప్టెంబర్ 4న సింహరాశిలోకి ప్రవేశిస్తుంటే సెప్టెంబర్ 23న కన్యరాశిలోకి ప్రవేశం ఈ రెండు రాశుల మార్పు కారణంగా బుధ గ్రహం ఈ ఐదు రాశులను ప్రభావితం చేస్తుంది. ఈ ఐదు రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ఆ ఐదు రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ధనస్సు రాశి: ఈ రాశి వారికి బుధ గ్రహం రాశి మార్పు కారణంగా వీరి జీవితంలో ఆనందం పెరుగుతుంది. వీరికి సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. వీరు సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీరుకి బ్యాంకు నుండి లోను వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీనివల్ల మీ ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. వ్యాపారంలో మీ స్నేహితులు పెట్టుబడి పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
తులారాశి: ఈ రాశి వారికి బుధుడి రాశి మార్పు కారణంగా మీరు కోరుకున్న పనులన్నీ సక్రమంగా నెరవేరుతాయి. వ్యాపారంలో గొప్ప విజయాలను పొందుతారు మీకు అనేక రకాల నుండి ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. దూరపు బంధువుల నుండి డబ్బును అందుకుంటారు. ఎప్పటినుంచో ఇబ్బంది పెడుతున్న అప్పుల బాధ నుండి విముక్తి పొందుతారు. జీవిత భాగస్వామి మీకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి దూరప్రాంతాలకు విహారయాత్రలకు వెళ్తారు.
కర్కాటక రాశి: ఈ రాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీని ద్వారా మీ జీతం పెరుగుతుంది. నూతనంగా వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి అవి వ్యాపారాన్ని పెంచడానికి సహాయపడతాయి. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు ఎప్పటినుంచో ఇబ్బంది పడుతున్న అనారోగ్య సమస్య నుండి బయటపడతారు. దీనివల్ల మీరు మానసిక సమస్య నుండి బయటపడతారు. విద్యార్థులకు కోరుకున్న రంగాల్లో ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
Astrology: బద్రినాథ్ కు అత్యంత ఇష్టమైన 4 రాశులు ఇవే
మీన రాశి: ఈ రాశి వారికి బుధుడు రెండుసార్లు రాశి సంచారం కారణంగా వీరి జీవితాల పైన సానుకూల ప్రభావం ఉంటుంది. ప్రేమ వివాహాలకు మీ కుటుంబ సభ్యులు అంగీకారాన్ని తెలియజేస్తారు. స్టాక్ మార్కెట్లో మీకు మంచి లాభాలు వస్తాయి. వ్యాపారాన్ని విదేశాల్లో విస్తరింప చేయడానికి మీరు చేసే ఆలోచన కార్యరూపం దాలుస్తుంది. కోర్టు సమస్యల నుండి బయటపడతారు.
వృషభ రాశి: ఈ రాశి వారికి కొత్త వ్యాపారాలు చేయాలనుకున్న ఆలోచన కార్యరూపం దాలుస్తుంది. మీ పనిలో సృజనాత్మక పెరిగి విజయాన్ని సాధిస్తారు. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక ప్రయోజనాలు అన్ని వైపుల నుండి లభిస్తాయి. మీ వ్యాపారాన్ని విస్తరింప చేయడానికి ఇది శుభ సమయం నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. విదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి మీరు చేసే ఆలోచన కార్యరూపం దాలుస్తుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.