Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజ గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది సంపదను ఆయుష్షును పెంచే గ్రహంగా చెప్పవచ్చు. జనవరి 17వ తేదీన కుజ గ్రహం పునర్వసు నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది. దీనికి కారణంగా మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ అదృష్ట రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మిథున రాశి- మిధున రాశి వారికి కుజ గ్రహ సంచారం అనేక సానుకూల ఫలితాలను అందిస్తుంది. వీరిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. కెరీర్లో ఉన్నత స్థితికి చేరుకుంటారు ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు ఉండవు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు.
Astrology: జనవరి 18వ తేదీన రాహు కేతు సంచారం
కన్యారాశి- పూజ గ్రహ సంచారం అనేక శుభ ఫలితాలను అందిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు ఉంటాయి. వ్యాపార విస్తరణ కోసం ఇది మంచి సమయం విదేశాల్లో పెట్టుబడిలో పెట్టాలనుకునే వారికి మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏలినాటి శని ప్రభావం తగ్గుతుంది. ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు ఉండవు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. విద్యార్థులు చదువుల్లో ముందుంటారు. కోరుకున్నచోట సీటు లభిస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభిస్తుంది. జీతాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు.
కుంభరాశి- కుంభరాశి వారికి జనవరి 17 నుంచి కుజగ్రహ సంచారం అనేక సానుకూల ఫలితాలను అందిస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. విదేశాల్లో చదువుకోవాలన్న కళ విద్యార్థులకు నెరవేరుతుంది. కెరీర్ లో ఉన్నత శిఖరాలకు వెళతారు. ప్రైవేట్ ఉద్యోగం చేసే వారికి ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. మీ పనితీరుకి మీ యజమానులు సంతోషిస్తారు. వివాహం కాని వారికి వివాహమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ప్రేమ వివాహాలకు అనుకూలం. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళతారు. విద్యార్థులు ఉన్నత చదువులకు మంచి సీటు లభిస్తుంది.
Disclaimer:పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.