astrology

Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్ర గ్రహానికి గురు గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది జనవరి 18వ తేదీన ఈ రెండు గ్రహాలు కూడా ఒకే రాశిలోకి ప్రవేశిస్తున్నాయి. మీనరాశిలోకి ఈ రెండు గ్రహాలు ప్రవేశించడం ద్వారా ఈ మూడు రాశుల వారు కోటీశ్వరులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ మూడు రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

మిధున రాశి.. శుక్రుడు గురుడు కలయిక వల్ల ఈ మిధున రాశి వారికి అనేక శుభ ఫలితాలు ఉన్నాయి. వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. వ్యాపార విస్తరణ కోసం మీరు చేసే ప్రయత్నాలు ఈరోజే ప్రారంభించడం చాలా శుభకరమైన ఫలితాలను అందిస్తుంది. వ్యాపారంలో గణనీయమైన ఆర్థిక లాభాలు వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి మంచి లాభాలు ఉంటాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు. తల్లిదండ్రులు ఆనందంగా ఉంటారు ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు ఉండవు.

Health Tips: జలుబు దగ్గు సమస్యతో బాధపడుతున్నారా

వృశ్చిక రాశి.. వృశ్చిక రాశి వారికి గురుడు శుక్రుడి కలయిక వల్ల అనేక సానుకూల ఫలితాలు ఉంటాయి. విదేశాల్లో పెట్టుబడులు పెట్టాలనుకునే వారు ఈ రోజు నుంచి ప్రారంభం చేస్తే అన్ని శుభ ఫలితాలు వస్తాయి. వ్యాపార విస్తరణ కోసం మీరు చేసే ప్రయత్నాలు అన్ని శుభ ఫలితాలను ఇస్తాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది.ఆర్థిక ప్రయోజనాలు బలపడతాయి. పూర్వికులు నుంచి రావాల్సిన ఆస్తులు వస్తాయి. కోర్టు వ్యవహారాలు తొలగిపోతాయి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు.

కుంభరాశి- కుంభరాశి వారికి గురుడు శుక్రుడి కలయిక అమోఘ ఫలితాలను అందిస్తుంది. వీరికి అదృష్టం కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు కోరుకున్నచోట బదిలీ అవుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్స్ లభిస్తాయి జీతం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. విద్యార్థులు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళతారు. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు. కెరీర్పణంగా అనేక లాభాలు ఉంటాయి. ఎప్పటినుంచో కొనాలనుకుంటున్నా సొంత ఇంటి కల నెరవేరుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆహ్లాదంగా గడుపుతారు.

Disclaimer:పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.