Health Tips: చలికాలం వచ్చినప్పుడు తరచుగా ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. దీనివల్ల దగ్గు ,జలుబు వంటి రకరకాల వైరస్ లు ఒకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే మనము కొన్ని కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. అయితే ఎలా తయారు చేసుకోవాలి.
సాల్ట్ వాటర్- బాగా దగ్గు అనిపించినప్పుడు సాల్ట్ వాటర్ ను గార్గిలింగ్ చేస్తే గొంతు సమస్యలు తగ్గిపోతాయి. నీటిని కొంచెం వేడి చేసుకుని అందులో ఒక స్పూన్ సాల్ట్ ని వేసుకొని నిద్రలేవగానే గార్గిలింగ్ చేస్తే గొంతు సమస్యలతో పాటు దగ్గు కూడా కంట్రోల్ అవుతుంది. అంతేకాకుండా నోట్లో ఉన్న బ్యాక్టీరియా కూడా క్లీన్ అవుతుంది.
Health Tips: చలికాలంలో పచ్చి బఠానీలు తీసుకోవడం ద్వారా కలిగే లాభాలు..
నిమ్మరసం- ప్రతిరోజు ఉదయాన్నే నిమ్మరసం తేనె కలిపి తీసుకోవడం వల్ల జలుబు దగ్గు గొంతు సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి. తేనెలో యాంటీబ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. నిమ్మరసంలో విటమిన్ సి ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. నిమ్మ రసాన్ని పేనెను నేరుగా కలిపి తీసుకోవడం వల్ల బరువు కూడా తగ్గుతారు.
అల్లం టి- బాగా జలుబు దగ్గుగా ఉన్నప్పుడు రోగ నిరోధక వ్యవస్థ పెంచుకోవడానికి అల్లం బాగా సహాయపడుతుంది. అల్లాన్ని టీ లాగా చేసుకుని వేడివేడిగా తాగితే అందులో ఉన్న ఆంటీ ఇన్ఫర్మేషన్ గుణాలు జలుబు దగ్గు గొంతు సమస్యలు అనేక రకాల ఇన్ఫెక్షన్లు తగ్గిస్తాయి. ఇది జీర్ణ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది. అయితే దీన్ని మిల్క్ తో కలిపి తీసుకోవడం కంటే వాటర్ లో అల్లాన్ని మరిగించి తీసుకోవడం ద్వారానే ఎక్కువ ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. మీరు కావాలంటే రుచికోసం కాస్త తేనెను కూడా కలుపుకొని తాగవచ్చు.
పాలల్లో పసుపు- చలికాలంలో ఇది అత్యంత బాగా పనిచేసే రెమిడి అని చెప్పవచ్చు. పసుపులో కర్ఫ్యూమ్ అనే మూలకం ఉంటుంది. ఇది అనేక రకాల ఇన్ఫెక్షన్లు తగ్గిస్తుంది ముఖ్యంగా జలుబు దగ్గు వంటి సమస్యలను దూరం చేస్తుంది. అంతే కాకుండా ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. పాలల్లో పసుపు కలుపుకొని రాత్రిపూట పడుకునే ముందు దీన్ని తాగితే మంచి ఫలితాలు ఉంటాయి.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి