
ఈ సంవత్సరం దీపావళి అక్టోబర్ 31 ,ఒకటవ తేదీన వస్తుంది. అయితే అక్టోబర్ 30వ తేదీన శుక్రుడు ,బుధ గ్రహాలు రెండు కూడా వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాయి. దీనివల్ల ఈ రెండు గ్రహాల కలయిక వల్ల లక్ష్మీనారాయణ ఏర్పడుతుంది. ఈ లక్ష్మీనారాయణ యోగం వల్ల మూడురాశుల వారు అదృష్టవంతులు అవుతారు. ఆ మూడు రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కర్కాటక రాశి- కర్కాటక రాశిలో జన్మించిన వారికి శుక్రుడు ,బుధ గ్రహ కలయిక వల్ల లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది. ఈ లక్ష్మీనారాయణ యోగం వల్ల అంత శుభప్రదం. మీరు అనేక వైపుల నుంచి డబ్బు పొందుతారు .దీని వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. సామాజిక సేవ పట్ల మీకు ఆసక్తి పెరుగుతుంది. దీనివల్ల సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. రావలసిన డబ్బు సరైన సమయానికి అందుతుంది. ఎక్కడో ఎప్పటినుంచో రావాల్సిన ధనము తిరిగి వస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషకరమైన వాతావరణం గడుపుతారు. ఆరోగ్యం పట్ల ఎటువంటి సమస్యలు ఉండవు.
మేషరాశి - మేష రాశి వారికి కూడా ఈ లక్ష్మీనారాయణ యోగం చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. మీ వ్యాపార విస్తరణకు ఇది సరైన సమయం. వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులకు భారీ లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఖర్చులు తగ్గుతాయి. ఆదాయం రెట్టింపు అవుతుంది. ఉద్యోగస్తులకు బోనస్తోపాటు బహుమతులు కూడా అందుకుంటారు. వ్యాపార సమావేశాల్లో మీరే పై చేయిగా ఉంటుంది. కొత్త కస్టమర్లు వస్తారు మీ వైవాహిక జీవితంలో అనేక సమస్యల నుండి ఉపశమనాన్ని పొందుతారు. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు బలపడతాయి. దీర్ఘకాలికంగా ఎప్పటినుంచో ఇబ్బంది పెడుతున్న వ్యాధి నుండి ఉపశమనాన్ని పొందుతారు. దీని వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.
Vastu Rules For TV: వాస్తు ప్రకారం ఇంట్లో టీవీ ఏ దిక్కులో ఉండాలో తెలుసా ...
ధనస్సు రాశి- ధనస్సు రాశి వారికి శుక్రుడు ,బుధ గ్రహాలు కలయిక వల్ల అనేక సానుకూల ఫలితాలు ఉన్నాయి. కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగం కోసం ఎదురు చూసేవారికి మీరు అనుకున్న ఉద్యోగం లభిస్తుంది. విద్యార్థులు విదేశాలకు వెళ్లి చదువుకోవాలి. అనుకునే అవకాశం కూడా వస్తుంది. మీ కెరీర్ లో కొత్త కొత్త అవకాశాలను పొందుతారు. మీ పై అధికారుల నుండి ప్రశంసలు వస్తాయి. దీని వల్ల మీ గౌరవం పెరుగుతుంది. ఆకస్మికంగా మీకు ధన లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ వివాహాలకు అనుకూలం. మీ వ్యాపార విస్తరణకు పెట్టుబడులు పెట్టడానికి ఇది చాలా మంచి సమయం దీని వల్ల ఆర్థికపరమైన లాభాలు పెరుగుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి దీని వల్ల జీతం పెరుగుతుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.