జ్యోతిష శాస్త్రం ప్రకారం శని గ్రహం అక్టోబర్ 3 మధ్యాహ్నం 12 గంటలకు శతభిషా నక్షత్రం లోనికి ప్రవేశిస్తుంది. దీని కారణంగా 12 రాశుల పైన అనుకూల ప్రభావాలు ఉంటాయి. అయితే ముఖ్యంగా ఈ మూడు రాశుల వారికి లాభదాయకంగా ఉంటుంది. ఆ మూడు రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మీనరాశి- శని గ్రహం శతభిషా నక్షత్రంలోనికి ప్రవేశించడం వల్ల ఈ రాశి వారికి చాలా మంచిది. ఎప్పటినుంచో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యల నుండి బయటపడతారు. పని ఒత్తిడి నుండి బయటపడతారు. ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. మీరు కాస్త ఓపికగా ఉంటే మీరు కోరుకున్న పనుల్లో విజయవంతం అవుతాయి. విద్యార్థుల్లో పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు. మీకు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. కెరియర్ లో ముందుకు వెళ్తారు.
Vastu Tips: వాస్తు ప్రకారం ఇంట్లో ఈ దిక్కులో అద్దం పెడితే, అశుభం
మేషరాశి- శనీర్ రాశి మార్పు కారణంగా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులను సహ ఉద్యోగుల నుండి మద్దతు పొందుతారు. ఏదైనా పనిని ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే మీరు అక్టోబర్ 3 తర్వాత ప్రారంభించడం చాలా శుభకరం. ఏది నాటి శని నుండి బయటపడతారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. రావాల్సిన మొండిబకాయల నుండి డబ్బు తిరిగి వస్తుంది. ఆరోగ్యం సహకరిస్తుంది.
ధనస్సు రాశి- ఈ రాశి వారికి శతభిషా నక్షత్రం లోనికి శని ప్రవేశం వల్ల వీరికి చాలా మంచి జరుగుతుంది. వీరి కుటుంబ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. వ్యాపారం ప్రారంభించాలనుకునే నిర్ణయం సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. సంపద పెరుగుతుంది. డబ్బుతో పాటు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. విదేశీ పర్యటనలు చేస్తారు వ్యాపారాన్ని విస్తరించడానికి అక్టోబర్ 3 తర్వాత శుభకరంగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు. విహారయాత్రలకు వెళతారు నూతన గృహాన్ని కొనుగోలు చేయాలని కాల నెరవేరుతుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.