Newdelhi, April 22: రేపు బసవేశ్వర జయంతి. బసవేశ్వరుడు (1134–1196) హైందవ మతాన్ని సంస్కరించిన ప్రముఖులలో ఒకరు. ఆయన సమాజంలో కుల,వర్ణ, లింగ బేధాలు లేవని, అందరం సమానమేనని సుమారు గత ఎనిమిది వందల సంవత్సరాల క్రితమే చాటి చెప్పారు. అందుకనే బసవేశ్వరుడిని బసవన్న, బసవుడు, విశ్వగురు అని పిలుస్తారు. సమాజంలో కుల వ్వవస్థను, వర్ణ భేదాలను, లింగ వివక్షతను సమూలంగా వ్యతిరేకించిన అభ్యుదయ వాది. లింగాయత ధర్మం స్థాపించారు. కర్ణాటకలోని బాగేవాడి బసవేశ్వరుడి జన్మస్థలం. తండ్రి మాదిరాజు, తల్లి మాదాంబ. చిన్న వయసులోనే శైవ పురాణ గాథలను అభ్యసించాడు. ఉపనయనం చేస్తున్న తల్లిదండ్రులను వదలి కూడలసంగమ అనే పుణ్యక్షేత్రం దగ్గరకు చేరి.. అక్కడ ఉన్న సంగమేశ్వరుణ్ణి నిష్ఠతో ధ్యానించాడు. 12వ శతాబ్దంలో కర్ణాటక దేశాన్ని పాలించిన బిజ్జలుని కొలువులో చిన్న ఉద్యోగిగా చేరి, అతని భాండాగారానికి ప్రధాన అధికారియై భండారీ బసవడుగ ఖ్యాతినొందారు. బసవేశ్వరుడు బోధించిన సంప్రదాయమే అనంతర కాలంలో “లింగాయత ధర్మం”గా స్థిరపడింది. పాల్కురికి సోమనాథుడు తెలుగులో బసవపురాణం రాశారు. శివుడే సర్వేశ్వరుడు, శివుడిని మించిన వాడులేడన్న విశ్వాసంతో శివతత్వ ప్రచారానికి పూనుకున్నారు. అలా లింగాయత మతానికి బీజాలు వేశారు. కాగా, రేపు బసవ జయంతి సందర్భంగా.. బసవేశ్వర మహారాజ్ ఫోటోలు, హెచ్ డీ వాల్ పేపర్స్ కోసం క్లిక్ చేయండి.