
మంత్రి మల్లారెడ్డిపై సుప్రీంకోర్టులో కేసు నమోదైంది. డైరీ నంబరు 48915/2023గా కేసు నమోదు అయ్యింది. తప్పుడు ఎన్నికల అఫిడవిట్‌పై స్పెషల్‌లీవ్ పిటిషన్ దాఖలు అయ్యింది. పిటిషనర్ కందాడి అంజిరెడ్డి పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. మల్లారెడ్డి వయస్సు, చదువుకు సంబంధించి సరైన సమాచారం ఇవ్వడం లేదని పిటిషనర్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. అత్యవసర కేసుగా విచారించాలని సుప్రీంకు విజ్ఞప్తి చేశారు. మల్లారెడ్డికి సుప్రీం నోటీసులు జారీ చేసే ఛాన్స్ ఉంది. ఈ నెల 30లోపే కేసుపై విచారణకు అవకాశం ఉంది.