దీపాల పండుగ దీపావళి శోభ ఇప్పటికే అన్ని చోట్ల సంతరించుకుంది. దీపావళి అనగానే ముందుగా ప్రతీ ఇళ్లు మట్టి దీపాల వెలిగించడం నుంచి ఇంటి ముందు రంగురంగుల రంగవల్లులు, ఇంటి చుట్టూ అందమైన పూల హారాలు, తళతళమెరిసే లైట్ల అలంకరణలతో పాటు బాణాసంచా కాల్చడం వరకు అన్ని మన కళ్ల ముందు మెదులుతాయి.
అయితే ఈసారి ఈ దీపావళి పండగను మనం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో జరుపుకోబోతున్నాం. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ పండగలు జరుపుకునే విషయంలో కొన్ని ఆంక్షలు ఉన్నాయి. అయినప్పటికీ మన ఇంటిని మనం అందంగా అలంకరించుకోవడం, లోగిళ్లను రంగులతో ప్రకాశవంతంగా మార్చడంలో ఎలాంటి ఆంక్షలు లేవు. కాబట్టి మీ ఇంటి వాకిలిని అందమైన రంగవల్లులతో సింగారించుకోండి. ఈ పండుగ ప్రతి ఒక్కరి మానసిక స్థితిని మరింత ప్రకాశవంతంగా మార్చే పండుగ. మీ సృజనాత్మకతను సైతం పెంచే పండుగ. మరి ఈసారి మీ ఇంటి ముందు రంగవల్లులని ప్రత్యేకంగా ఎలా తీర్చిదిద్దుకావాలో ఆలోచించారా? దీని గురించి చింతించాల్సిన పనిలేదు, ఎక్కడో వెతకాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ మీ కోసం కొన్ని ప్రత్యేకమైన, సులభమైన దీపావళి రంగవల్లులను మీ ముందుకు తీసుకువస్తున్నాం. ఈ రంగవల్లులను మీరూ ప్రయత్నించండి, దీపావళి వేడుకల్లో మీరు ప్రత్యేకం అని చాటుకోండి.
Happy Rangoli Design
Swastik Rangoli Design
Peacock Rangoli Design
Chowk Rangoli Design
పైన చూపినట్లుగా సింపుల్‌గా దీపావళి రంగవల్లులు వేసుకోవడం ద్వారా ఇంటి అలంకరణకు, దీపాల వెలుగులకు ఈ రంగవల్లులు అదనపు ఆకర్శణగా నిలుస్తాయి. ఈ ఏడాది అందరూ ఇంటి వద్దే ఉంటూ, పండగల వేళ సామాజిక దూరాన్ని పాటిస్తూ స్వచ్ఛమైన, సురక్షిత మైన దీపావళిని జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ 'లేటెస్ట్‌లీ తెలుగు' తరఫున మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు ముందస్తుగా దీపావళి పండగ శుభాకాంక్షలు.