వినాయక చవితి, దసరా తర్వాత వచ్చే అతి ముఖ్యమైన హిందువలు పండుగ దీపావళి. ఈ పండుగ పిల్లలకు బాగా నచ్చుతుంది. పది రోజుల ముందు నుంచే బాణసంచా కాల్చుతూ.. పండుగ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తుంటారు. ఈసారి దీపావళికి ముందు ఆదివారం రావడంతో.. వరుసగా రెండు రోజులు సెలవు వచ్చాయి. అందువల్ల అందరూ బంధువులు, స్నేహితుల్ని కలిసేందుకు ఈ పండుగ అవకాశం కల్పిస్తోంది. అయితే కొంతమంది మాత్రం దూరంగా వేరే రాష్ట్రాలు, దేశాల్లో ఉద్యోగం నిమిత్తం లేదా వ్యాపార నిమిత్తం ఉంటున్నారు. అలాంటి వారు అక్కడి నుంచే సోషల్ మీడియా ద్వారా బంధువులకు, మిత్రులకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగలలో, భారతీయులు అత్యంత భక్తి శ్రద్ధలతో, అత్యంత ఇష్టంగా జరుపుకునే పండుగలలో దీపావళి ఒకటి. ఆశ్వయుజ మాసంలో కృష్ణ పక్షంలో దీపావళి పండుగను జరుపుకుంటారు. దీపావళి అంటేనే వెలుగుల పండుగ. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నిండాలని సూచించేదే దీపావళి పండుగ. లేటెస్ట్‌లీ తరపున మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు.
దీపావళి శుభాకాంక్షలు తెలుగులో చెప్పేందుకు బెస్ట్ మెసేజెస్ కోట్స్
దీపావళి శుభాకాంక్షలు తెలిపే అద్భుతమై కోటేషన్స్
మీ బంధువులకు, స్నేహితులకు ఈ మెసేజెస్ ద్వారా దివాళి శుభాకాంక్షలు చెప్పేయండి
దీపావళి అంటేనే వెలుగుల పండుగ. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నిండాలని సూచించేదే దీపావళి పండుగ.
జీవితంలోని చీకట్లను పారద్రోలి వెలుగులు నింపేదే దీపావళి
దీపావళి శుభాకాంక్షలు
దీపావళి అంటేనే సరదాలు, సంబరాలు, దీపాల వెలుగులు, బాణాసంచాల జిలుగులు, కుటుంబం అంతా కలిసి జరుపుకునే వేడుకలు.