Google honors Dr Kamal Ranadive with artistic doodle (Photo Credits: Google)

భారతీయ సెల్ బయాలజిస్ట్ డాక్టర్ కమల్ రణదివే 104వ పుట్టినరోజును గూగుల్ ఈరోజు డూడుల్‌తో (Dr Kamal Ranadive Google Doodle) జరుపుకుంటుంది. రణదివే తన సంచలనాత్మక క్యాన్సర్ పరిశోధనలకు, సైన్స్, విద్య ద్వారా మరింత సమానమైన సమాజాన్ని సృష్టించడంలో ప్రసిద్ధి చెందారు. నేటి డూడుల్‌ను ( Indian Cell Biologist With Artistic Doodle) భారతదేశానికి చెందిన అతిథి కళాకారుడు ఇబ్రహీం రేయింటకత్ రూపొందించారు. నేటి డూడుల్‌కు తన ప్రేరణ గురించి మాట్లాడుతూ, రేయింటకాత్ ఇలా అన్నాడు: "నా ప్రేరణ యొక్క ప్రధాన మూలం 20వ శతాబ్దపు ప్రయోగశాల సౌందర్యం, కుష్టు వ్యాధి, క్యాన్సర్‌కు సంబంధించిన కణాల సూక్ష్మ ప్రపంచం." డాక్టర్ రణదివే తన డూడుల్‌లో మైక్రోస్కోప్‌ని చూస్తున్నారని తెలిపారు.

కమల్ రణదివేగా ప్రసిద్ధి చెందిన కమల్ సమర్థ్ 1917లో భారతదేశంలోని పూణేలో ఈ రోజున జన్మించారు. వైద్య విద్య కోసం అతని తండ్రి నుండి ప్రేరణ పొందారు. కమల్ తండ్రి దినకర్ పూణెలోని ఫెర్గూసన్ కాలేజీలో బయాలజీ ప్రొఫెసర్‌గా ఉండేవారు. ఇంట్లోని పిల్లలందరికీ ముఖ్యంగా ఆడపిల్లలు బాగా చదువుకోవాలన్నదే ఆయన లక్ష్యం. కమల్ తన తండ్రి అంచనాలను నిలబెట్టారు. జీవితంలోని ప్రతి పరీక్షలోనూ మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. కమల్ ఎప్పుడూ కొత్తదనాన్ని నేర్చుకుని అందులో బాగా నైపుణ్యం సంపాదించి ఆ ప్రయోగాన్ని విజయవంతం చేసి చూపిస్తారు. ఆమె ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఉమెన్ సైంటిస్ట్స్ (IWSA) యొక్క కీలక వ్యవస్థాపక సభ్యురాలు కూడా. డాక్టర్ కమల్ జైసింగ్ రణదివేకు కూడా పద్మభూషణ్ అవార్డు లభించింది.

ఫ్రాంక్ కామెనీ 95వ పుట్టినరోజు, స్వలింగ సంపర్కుల హక్కుల కోసం ఉద్యమించిన అమెరికన్ శాస్త్రవేత్త, ఫ్రాంక్ కామెనీ బర్త్‌డే సంధర్భంగా డూడుల్‌‌తో గౌరవించిన గూగుల్

భారతదేశంలో మహిళల హక్కుల కోసం చాలా మంది మహిళలు తమ వంతు సహకారం అందించినప్పటికీ, డాక్టర్ కమల్ రణదివే పేరు మాత్రం ప్రత్యేకంగా ఉంటుంది. డాక్టర్ రణదివే భారతీయ మహిళల సమానత్వం కోసం సైన్స్ మరియు విద్యా రంగంలో తన వృత్తిపరమైన విజయాన్ని సాధించడానికి కృషి చేశారు. భారతీయ బయోమెడికల్ పరిశోధకురాలిగా, ఆమె క్యాన్సర్ చికిత్స కోసం విశేషమైన కృషి చేసారని చెప్చవచ్చు. వైద్యరంగంలో భారతీయ మహిళల సహకారం కూడా తక్కువేమీ కాదు. అందుకే గూగుల్ నేటి గూగుల్ డూడుల్‌ను (Dr Kamal Ranadive 104th Birth Anniversary) ప్రత్యేక భారతీయ మహిళ గౌరవార్థం అంకితం చేసింది.

కమల్ ఫెర్గూసన్ కాలేజీలోనే తన B.Sc బయాలజీని డిస్టింక్షన్‌తో పూర్తి చేసింది. ఆ తర్వాత పూణేలోని అగ్రికల్చర్ కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. దీని తరువాత ఆమె వృత్తిరీత్యా గణిత శాస్త్రజ్ఞుడైన JT రణదివేను వివాహం చేసుకుంది.