Eid Mubarak 2023 Wishes: ఈ మెసేజెస్ ద్వారా అందరికీ రంజాన్ శుభాకాంక్షలు చెప్పేయండి, రంజాన్ గొప్పదనాన్ని తెలిపే కోట్స్, వాట్సప్ స్టిక్కర్స్ మీకోసం, అందరికీ రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు
Eid Mubarak Wishes And Greetings

ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్‌ సంపూర్ణంగా అవతరించిన మాసమే రంజాన్. ఈ రంజాన్‌ మాసంను ముస్లింలు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఉపవాసాలు, దీక్షలు, ఆధ్యాతిక్మక చింతన, దానాలు, ధర్మాలు చేపడతారు. నెలవంకతో ప్రారంభమైన రంజాన్‌ మాసం.. మళ్లీ నెలవంక రాకతో ముగుస్తుంది. నెల రోజుల ఉపవాస దీక్ష అనంతరం ‘ఈద్‌ ఉల్‌ ఫితర్‌’ పండుగతో రంజాన్ పండుగ ముగుస్తుంది. ఈ ఏడాది మే 2న ముస్లిం సోదరుల రంజాన్ ఉపవాసాలు ముగించుకొని ‘ఈద్ ఉల్ ఫితర్‌’ నిర్వహించనున్నారు.

కాగా నెలవంక కనిపించే సమయాన్ని బట్టి.. ఒక్కో దేశంలో ఒక్కో సమయంలో ఈద్ ఉల్ ఫితర్ జరుగుతుంది. ఇందులో భాగంగానే ఈ సారి రంజాన్ పండుగను మే 3న జరుపుకోనున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 3న ప్రారంభమైన ఉపవాస దీక్ష మే 2తో ముగిసింది. ఆదివారం నాడు నెలవంక కనిపించడంతో సోమవారం రంజాన్ మాసం చివరి రోజుగా భావించి ఉపవాసం పాటించాలని రుహియతే హిలాల్ కమిటీ (నెలవంక నిర్ధారణ కమిటీ) పేర్కొంది.

రంజాన్..దివ్య ఖురాన్ ఆవిర్భవించిన మాసం, ముస్లింలు నెల రోజుల పాటు అత్యంత కఠిన నియమాలతో ఆచరించే పండుగ, రంజాన్‌ మాసం చరిత్ర, ఉపవాస దీక్షలపై ప్రత్యేక కథనం

కాబట్టి మే 3న (మంగళవారం) రంజాన్ జరుపుకోవాలని పిలుపునిచ్చింది.ఈ సందర్భంగా అందరికీ లేటెస్ట్‌లీ తరపున రంజాన్ శుభాకాంక్షలు.

Eid Mubarak Wishes And Greetings
Eid-Mubarak-2022
రంజాన్ శుభాకాంక్షలు
Happy Eid Mubarak 2022
Happy Eid Mubarak 2022 Messages