
Friendship Day 2022 Wishes and Greetings:స్నేహితుల దినోత్సవం అంటే కానుకలు ఇచ్చిపుచ్చుకోవడం, శుభాకాంక్షలు చెప్పుకోవడం, విందులు చేసుకోవడం కాకుండా స్నేహం, శాంతి పెంపొందించే ఉద్దేశంతో ఐక్యరాజ్యసమితి ఆ నెలను అంతర్జాతీయ స్నేహితుల మాసంగా ప్రకటించింది. అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవంను (Happy Friendship Day 2022) మన దేశంలో ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం జరుపుకుంటారు.
ప్రజలు తమ స్నేహితులపై (Friends) ఉన్న తమ ప్రేమను వ్యక్తపరచడానికి తమ స్నేహితులతో గడుపుతారు. ఈ సందర్భంగా పువ్వులు, కార్డులు, మణికట్టు బ్యాండ్లు వంటి ఫ్రెండ్షిప్ డే (Happy Friendship day) బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు, ఇది ఒక ప్రముఖ సాంప్రదాయం.ఇక ఆలస్యమెందుకు స్నేహితుల దినోత్సవం శుభాకాంక్షలు ఈ మెసేజెస్ ద్వారా చెప్పేయండి.

ఎదుటివాడిలోని లోపాన్ని భరించే వాడే నిజమైన స్నేహితుడు, అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు

మనకు గురువులా బోధించి, దారి చూపి, తప్పు చేసినప్పుడు మందిలించే వ్యక్తే నిజమైన స్నేహితుడు. అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు

కష్ట సమయంలో కలత చెందిన మనసుకి ప్రశాంతతను కలిగించే దివ్య ఔషధం స్నేహం. స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు

ప్రతీ రోజు మాట్లాడుకోకున్నా అవసరమైనప్పుడు మనకు ధైర్యం, ఓదార్పు చెప్పే వాడే మన నేస్తం. స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు

స్నేహం చేయడం మీ బలహీనత అయితే ప్రపంచంలో మీ అంత బలవంతుడెవరూ ఉండరు. స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు

నీ మీద నీకే నమ్మకంలేని సమయంలో నిన్ను నమ్మి నీ వెంట నడిచేవాడే నీ మిత్రుడు. స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు

వంద మంది స్నేహితులు ఉండటం గొప్పకాదు.. వంద సమస్యలు తీర్చే ఒక్క మిత్రుడు ఉండటం గొప్ప. స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు