భాద్రపద శుక్లపక్ష చతుర్థి రోజున జరుపుకునే సనాతన ధర్మ పండుగలలో గణేష్ చతుర్థి ముఖ్యమైన పండుగ. ప్రతి నెల కృష్ణ పక్షం చతుర్థి తిథి వినాయకుడిని పూజించడానికి ప్రత్యేకమైన రోజు. భాద్రపద శుక్ల చతుర్థి నాడు, గణేశుడి సిద్ధి వినాయక రూపాన్ని పూజిస్తారు. శాస్త్రాల ప్రకారం, గణేశుడు ఈ రోజు మధ్యాహ్న సమయంలో అవతరించాడు, అందుకే ఈ గణేష్ చతుర్థి విశేష ఫలప్రదంగా చెబుతారు. ఈ పండుగ గణేశోత్సవం పేరుతో దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. మన శాస్త్రం ప్రకారం, గణేష్ చతుర్థి నాడు చంద్రుడిని చూడకూడదు ఎందుకంటే ఈ రాత్రి చంద్రుడిని చూడటం తప్పుడు ఆరోపణలకు దారి తీస్తుంది. శ్రీ కృష్ణుడు ఒకసారి శుక్ల పక్షంలోని భాద్రపద చవితి రోజున చంద్రుడిని చూసినప్పుడు నీలాపనిందలు ఎదుర్కొన్నాడు. మీరు అనుకోకుండా గణేష్ చతుర్థి రోజున చంద్రుడిని చూసినప్పటికీ, దోషాన్ని నివారించడానికి ముందుగా వినాయకుడిని పూజించండి. అలాగే అక్షింతలు వేసుకోండి.
విఘ్నాలు తొలిగించి విజయాలను అందించే ఆ మహాగణపతి ఆశీస్సులు మీకు మీ కుటుంబసభ్యులకు ఉండాలని కోరుకుంటూ.. మిమ్మల్ని విజయమార్గంలో నడిపించి అష్టైశ్వర్యాలు , ఆయురారోగ్యాలు అందించాలని ఆకాంక్షిస్తూ...
వినాయక చవితి శుభాకాంక్షలు
మీరు ఏ పని మొదలుపెట్టిన ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తయ్యేటట్లు చూడాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు
తలపెట్టిన ప్రతిపనిలో విజయాన్ని అందించి శుభాలను ప్రసాదించే గణ నాయకుడిని ఇంటింటా, వాడవాడలా నెలకొల్పి పూజిస్తున్న ఈ శుభవేళ. తెలుగు ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ విఘ్నాధిపతి మీ అందరికీ ఆయురారోగ్య సంతోషాలను అందివ్వాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు.
గణనాథుడు మిమ్మల్ని అన్నివేళలా దీవించాలి. మీరు ఏ పని మొదలుపెట్టినా ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తయ్యేటట్లు చూడాలని ఆ మహాగణపతిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు.
జ్ఞానాన్ని, సంకల్ప శక్తిని, సద్గుణ సంపదలనీ అనుగ్రహించే గణపతిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తున్న ప్రజలందరికీ "వినాయకచవితి" శుభాకాంక్షలు. మీరు తలపెట్టిన పనులన్నీ ఏ విఘ్నాలు లేకుండా విజయవంతంగా పూర్తి కావాలని.. మీ ఇంటిల్లిపాది ఆనంద,ఆరోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను... మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు.