#ChildrensDay2020: బాలల దినోత్సవం ఏ దేశంలో ఎప్పుడు,ఎక్కడ, ఎలా జరుపుకుంటారు? చాచా నెహ్రూ కోట్స్‌తో పిల్లలకు ఓ సారి శుభాకాంక్షలు చెప్పేయండి
Happy Children's Day Quotes (Photo Credits: File Image)

భారతదేశ తొలి ప్రధాన మంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ (Jawaharlal Nehru) పుట్టిన రోజైన నవంబర్‌ 14న దేశవ్యాప్తంగా బాలల దినోత్సవం (Children’s Day) జరుపుకుంటాం. నెహ్రూకి పిల్లలంటే ఎంతో ఇష్టం. పిల్లలు కూడా ... అందుకే ఆయన జన్మదినమైన నవంబర్ 14న అందరూ బాలల దినోత్సవం (Children's Day 2020) గా జరుపుకుంటారు. అందరూ అనుభవించే బాల్యం.. భగవంతుడు ఇచ్చిన ఓ అమూల్యమైన వరం. అభం శుభం తెలియని ఆ పసి మనసులు పూతోటలో అప్పుడే పరిమళించిన పువ్వులు. అందుకు సూచకంగా ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలలో బాలల దినోత్సవంలు జరుపుకుంటారు.

ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం బాలల దినోత్సవాన్ని నవంబర్ 20న అధికారికంగా జరుపుకుంటుంటారు. అయితే 1954కి ముందు అక్టోబర్ నెలలో బాలల దినోత్సవాన్ని జరుపుకునేవారు. ఐక్యరాజ్యసమితి నిర్ణయించిన ప్రకారం బాలల దినోత్సవాన్ని మొదటిసారిగా 1954లో ప్రపంచమంతటా నిర్వహించారు. 1959 నవంబర్ 20న బాలల హక్కుల ప్రకటనను ఐరాస సర్వసభ్య సభ రూపొందించిన సందర్భంగా బాలల దినోత్సవాన్ని ప్రపంచ మంతటా జరుపుకోవాలని నిర్ణయించారు.

1989లో పిల్లల హక్కులపై నవంబర్ 14న ఓ బిల్లును ఐరాస ఆమోదించింది. ఈ బిల్లును ఆమోదిస్తూ 191 దేశాలు సంతకాలు పెట్టాయి కూడా. పిల్లలు తమ భావాలను, సమాచారాన్ని పంచుకోవడాన్ని, పరస్పర అవగాహనను పెంచుకోవడాన్ని ప్రోత్సహించేందుకు గాను ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ బాలల దినోత్సవానికి రూపకల్పన చేసింది. ప్రపంచమంతటా పిల్లల సంక్షేమాన్ని ప్రోత్సహించేందుకోసం పలు చర్యలు చేపట్టడం ఈ దినోత్సవం లక్ష్యం.

పాఠకులకు దీపావళి శుభాకాంక్షలు, పండుగ విశిష్టతను ఓ సారి తెలుసుకుందాం. దీపావళి విషెస్..ఈ అందమైన కోటేషన్లతో అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలపండి

బాలల దినోత్సవాన్ని ఒక్కో దేశం ఒక్కో రోజున జరుపుకుంటుంది. చైనాలో జూన్‌ 1వ తేదీన బాలల దినోత్సవం జరుపుకుంటారు. శుభాకాంక్షలు చెప్పుకుని పాఠశాలల్లో ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోజు పాఠశాలలు తెరిచివున్నా తరగతులు జరగవు.

పాకిస్తాన్‌లో నవంబర్‌ 20వ తేదీన బాలల దినోత్సవం జరుపుకుంటారు. ఆరోజున పాఠశాలలు మామూలుగానే నడుస్తాయి. టీవీలు, రేడియోల్లో మాత్రం ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం చేస్తారు.

చాచా’ పుట్టిన రోజు సందర్భంగా గూగుల్ ప్రత్యేక డూడుల్, దేశ వ్యాప్తంగా ఘనంగా నెహ్రూ పుట్టిన రోజు వేడుకలు, భారత తొలి ప్రధాని పుట్టిన రోజే బాలల దినోత్సవం

జపాన్‌లో మే 5న జరుపుకుంటారు. ఆరోజున మగపిల్లలున్న వారు చేప ఆకారంలో వున్న గాలిపటాలను ఎగురవేస్తారు. అంతేకాక యుద్ధవీరుల బొమ్మలతో కొలువు ఏర్పాటుచేస్తారు. ఆరోజు జాతీయ సెలవుదినంగా కూడా ప్రకటిస్తారు. కొడొమొ నొ హి పేరుతో బాలల దినోత్సవం జరుగుతుంది.

దక్షిణ కొరియాలో మే 5వ తేదీన బాలల దినోత్సవం జరుపుకుంటారు. ఆరోజున ఇక్కడ పిల్లలకోసం ఎక్కువ సమయం కేటాయిస్తారు. వారు ఎప్పుడూ గుర్తుంచుకునేలా పెద్దలు పిల్లలకోసం ఎక్కువ సమయం కేటాయిస్తారు. ఎక్కడికైనా బయటకు తీసుకెళతారు.పోలాండ్ లో జూన్‌ 1న బాలల దినోత్సవం చేసుకుంటారు. ఆరోజున స్కూళ్లల్లోనే రకరకాల కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. పార్కుల్లో, వినోద కేంద్రాలలో పిల్లలకోసం ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు.

శ్రీలంకలో అక్టోబర్‌ 1 అంటే పండుగే. పెద్దలు తప్పనిసరిగా వారిని బయటకు తీసుకెళతారు. ఇళ్లల్లో వారికోసం ప్రత్యేకంగా స్వీట్లు చేస్తారు.ఆగస్టు 16న పెరుగ్వేలో జరుపుకుంటారు. దీనికి కారణం ఏంటంటే 1869లో జరిగిన ఓ యుద్ధంలో దాదాపు 3500 మంది తొమ్మిది నుంచి 15 ఏళ్ల చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. వారికి నివాళి అర్పిస్తూ ఈ రోజు బాలల దినోత్సవాన్ని జరుపుకుంటారు. మరికొంతమంది తమ ఇళ్లలో చనిపోయిన చిన్నారులకు నివాళి అర్పిస్తారు.

చిలిలో బాలల దినోత్సవం ఏటా రెండు సార్లు నిర్వహిస్తారు. అక్టోబర్ లో ఓసారి ఆగస్టులో మరోసారి జరుపుకుంటారు. ఆస్ట్రేలియాలో అక్టోబర్ నాలుగవ వారంలో జరుపుకుంటారు. బాలల హక్కుల కోసం అక్కడ నాలుగు వారాల పాటు బాలల వారోత్సవాలు నిర్వహిస్తారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇందుకోసం ప్రతి రాష్ట్రానికి 2 వేల డాలర్లను కేటాయిస్తుంది.

మెక్సికోలో ఏఫ్రిల్ 30న బాలల దినోత్సవం జరుగుతుంది. టర్కీలో ఏప్రిల్ 23న బాలల దినోత్సవం జరుగుతుంది. థాయ్ లాండ్ లో జనవరి నెల రెండో శనివారం నాడు జరుగుతుంది. ఇక్కడ ఈ దినోత్సవాన్ని వాన్ డే గా పిలుస్తారు. దక్షిణాఫ్రికాలో నవంబర్ తొలి శనివారం, మలేషియాలో అక్టోబర్ చివరి శనివారం, సింగపూర్ లో అక్టోబర్ తొలి శుక్రవారం, అర్జెంటైనాలో ఆగస్టు తొలి ఆదివారం ఇండోనేషియాలో జూలై 30 న, అమెరికాలో జూన్ రెండవ వారంలో, నైజీరియాలో మే 27న, యూకేలో మే రెండో ఆదివారం నాడు జరుపుకుంటాయి.

సోవియట్ యూనియన్ లో గత 52 దేశాలు జూన్ 1న బాలల దినోత్సవం జరుపుకుంటాయి. అరబ్ దేశాలు, కెనాడా, ఈజిప్ట్, ఐర్లాండ్ తో సహా 27 దేశాలు నవంబర్ 20న జరుపుకుంటాయి.

కొటేషన్లు

1. చిన్నారులే దేశానికి వెలకట్టలేని ఆస్తి. తల్లిదండ్రుల ఆశలకు ప్రతిరూపాలు వారు. ఆ చిన్నారులకు మనం ఇవ్వగలిగే గొప్ప బహుమతి చదువొక్కటే. రేపటి నవ సమాజ నిర్ణేతలకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు

2. బుజ్జి బాలలారా... మొబైల్స్... ఐపాడ్స్ కి దూరంగా అమ్మ నాన్న ల కి బుక్స్ కి దగ్గరగా.... మీ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటూ. పిల్లలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు

3 నేటి బాలలే...రేపటి పౌరులు. బాలల బంగారు భవిష్యత్తుకు మనవంతు తోడ్పాటునందిస్తూ వారి ఉన్నతికి మనమందరం సహకరిద్దాం.చిన్నారులందరికి 'బాలల దినోత్సవ శుభాకాంక్షలు

4. జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా చిన్నారులందరికీ శుభాకాంక్షలు, శుభాశీస్సులు. నేటి బాలలే రేపటి దేశ భవిష్యత్తు. అందుకే బాల్యం నుంచే వారిలో సృజనాత్మకతతోపాటు నైతికత, వైభవోపేతమైన భారతదేశ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను నేర్పిస్తూ.. వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేద్దాం

5. భరత మాత ముద్దుబిడ్డలు, నేటి బాలలు, రేపటి పౌరులకి బాలల దినోత్సవ శుభాకాంక్షలు.

6. భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ పుట్టిన రోజునే ఏటా ‘బాలల దినోత్సవం’గా జరుపుకుంటున్నాం. బాలల దినోత్సవ శుభాకాంక్షలు

7. చిన్నారులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు