Dhanteras Wishes in Telugu (1)

అక్టోబర్ 22న ధన్వంతరి పుట్టిన రోజుగా జరుపుకుంటారు. దీన్ని ధన్ తేరస్ గా పిలుస్తారు. ఈ రోజును మంచిరోజుగా భావిస్తారు. ధన్ తేరస్ రోజు షాపింగ్ చేయడానికి ప్రాధాన్యం ఇస్తారు. నగలు, పాత్రలు, భూమి, వాహనాలు కొనుగోలు చేసేందుకు ఉత్సాహం చూపుతారు. కానీ ఈ రోజు కొనుగోలు చేయని వస్తువులు కూడా ఉంటాయి. లక్ష్మీదేవికి నచ్చని వస్తువులను ఈ రోజు కొనుగోలు చేయకూడదు. ధన్ తేరస్ రోజు ఏ వస్తువులు కొనకూడదో తెలుసుకుంటే మంచిది. వాటిని కొనుగోలు చేసుకుని బాధలు పడే బదులు వాటిని కొనుగోలు చేయకుండా ఉండేందుకు ప్రాధాన్యం ఇవ్వడానికి సుముఖంగా ఉండాలి.

ఉక్కు, అల్యూమినియం వస్తువులను ధన్ తేరస్ రోజు కొనుగోలు చేయకూడదు. పురాణాల ప్రకారం ఇత్తడి, బంగారం లేదా వెండి లోహాలను కొనుగోలు చేయడం ఉత్తమం. అల్యూమినియంలో రాహువు ఉండటం వల్ల సమస్యలకు కారణమవుతుంది. చాలా మంది ధన్ తేరస్ రోజు కృత్రిమ ఆభరణాలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. కానీ అలా చేయకూడదు. ధన్ తేరస్ లో గాజు పాత్రలు కూడా కొనకూడదు. గాజులో కూడా రాహువు ఉండటం వల్ల మనకు నష్టాలే వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

అక్టోబర్ 23 ధనత్రయోదశి నుంచి ఈ మూడు రాశుల వారికి శని ప్రభావంతో డబ్బే డబ్బు, కోటీశ్వరులు అవ్వడం ఖాయం..

చక్కెర, కుండలు కూడా ఈ రోజు ఇంటికి తీసుకురాకూడదు. ఒకవేళ తీసుకొస్తే అశుభమే. ధన్ తేరస్ రోజు ఇలాంటి వస్తువులను ఇంటికి తీసుకురావడం చేస్తే ఇబ్బందులే వస్తాయి. ఇనుముతో తయారు చేసిన వస్తువులు కూడా తీసుకోకూడదు. తీసుకొస్తే ఇంటి సమస్యలు చుట్టుముడతాయి. ఖర్చులు అధికమవుతాయి. అదృష్టం దురదృష్టంగా మారవచ్చు. ఇంకా ప్లాస్టిక్ పాత్రలు కూడా ఈ రోజు కొనకూడదు. ప్లాస్టిక్ వస్తువులను కొనుగోలు చేసినా మనకు నష్టాలే వస్తాయి. పుల్లలు ఉన్న చీపురు కొనడం మాత్రమే శుభకరం. ప్లాస్టిక్ వస్తువులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా కొనకండి.

ధన్ తేరస్ రోజు జాగ్రత్తలు తీసుకోకపోతే మనకు ఇబ్బందులు వస్తాయనడంలో సందేహం లేదు. అందరు ధన త్రయోదశి రోజుగా భావించి ఏది పడితే అది కొనకూడదు. తెలుసుకుని మసలుకుంటే మంచిది. ఎందుకంటే మనం చేయకూడని పనులు చేస్తే ఆర్థికంగా మనకు తిప్పలు తప్పకపోవచ్చు. అందుకే నిపుణులు చెప్పిన విధంగా ఏవి కొనకూడదో, ఏవి కొనాలో తెలుసుకుంటే మంచిది. దీంతో మనకు ఎలాంటి నష్టాలు రావు. ఇబ్బందుల నుంచి కూడా బయటపడొచ్చు.  ధన్‌తేరస్ శుభాకాంక్షలు చెప్పేయండి ఇలా..

Dhanteras Wishes in Telugu (1)

 

Dhanteras Wishes in Telugu (2)
Dhanteras Wishes in Telugu (3)

 మీకు మీ కుటుంబ సభ్యులకు, బంధువులకు లేటెస్ట్‌లీ తరపున ధన్‌తేరాస్ శుభాకాంక్షలు