Independence Day Wishes in Telugu: భారత జాతికి విముక్తిని కల్పించడానికి ఎంతో మంది బ్రిటిష్ వారి తూటాలకు నేలకొరిగారు. మరెంతో మంది నిరాహార దీక్షలు చేశారు. త్యాగధనుల వీరత్వానికి బ్రిటిష్ వారు మన దేశాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయారు. అప్పుడే ఎర్రకోట మీద మన జాతీయ జెండా (Indian flag) రెపరెపలాడింది. అప్పటి నుంచి ప్రతి ఏటా ఆగస్టు 15వ తేదీన మనం స్వాతంత్ర దినోత్సవాన్ని (Independence Day 2023) జరుపుకుంటూ వస్తున్నాం. మహానీయులను గుర్తు చేసుకుంటున్నాం.
జెండాలో ఉన్న ఒక్కో రంగు ఒక్కో విషయాన్ని మనకు తెలియజేస్తాయి. కాషాయ రంగు దేశ పటిష్టతకు, ధైర్యానికి ప్రతీకగా నిలిస్తే, మధ్యలో ఉండే తెలుపు రంగు శాంతిని సూచిస్తుంది. కింద ఉండే ఆకుపచ్చ రంగు దేశ ప్రగతికి సూచికగా నిలుస్తుంది. ఇక మధ్యలో ఉండే అశోక చక్రం ధర్మాన్ని సూచిస్తుంది. పాఠకులందరికీ లేటెస్ట్‌లీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.
భారత స్వాత్రంత్ర దినోత్సవం సందర్భంగా అద్భుతమైన మెసేజెస్
అన్ని దేశాల్లో కెల్లా భారతదేశం మిన్న అని చాటి చెబుతూ జరుపుకుందాం ఈ పండుగను కన్నుల విందుగా.. అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
ఏ దేశమేగినా -ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా- ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవం. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
మాతృభూమి కోసం తమ ధన, మాన, ప్రాణాలను త్యాగం చేసిన భరతమాత ముద్దు బిడ్డలకు వందనం.. అభివందనం. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
మన స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం అసువులు బాసిన సమర యోధుల దీక్షా దక్షతలను స్మరిస్తూ.. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
ఈ రోజు, మన వీర వీరులను స్మరించుకుందాం, వారు పోరాడి సాధించిన స్వాతంత్య్రాన్ని జరుపుకుందాం. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు