Happy Kanuma 2023 Telugu Wishes: సంక్రాంతి (Sankranthi) పండగలో భాగంగా మూడో రోజు జరపబడే పర్వదినాన్ని కనుమ అంటారు. ఇది వ్యవసాయదారులు, రైతులు జరుపుకునే పండగ. దీనిని పశువుల పండుగగా కూడా చెప్తారు. రైతుల జీవితంలో పశువులు కూడా ఒక భాగమే. పంటలు చేతికి అందించడంలో తమకు సహాయపడిన పశు పక్షాదులను ఈరోజు పూజిస్తారు.
ఏడాదికాలంగా తమతో పాటు కష్టపడి పనిచేసిన ఆవులు, ఎద్దులు, ఇతర పాడి పశువులకు కృతజ్ఞతగా, వాటిని పూజించి ప్రేమగా చూసుకునే రోజుగా కనుమకు ప్రాధాన్యం ఉంటుంది. అలాగే పంటలకు పట్టిన చీడలను నియంత్రించే పక్షులు కూడా రైతన్ననేస్తాలే. అందుకే వాటి కోసమే అన్నట్లుగా కనుమ రోజు ఇంటి గుమ్మానికి ధాన్యపు కంకులు వేలాడ దీస్తారు.
ఆంధ్రా, రాయలసీమ మరియు తమిళనాడు ప్రాంతాల్లో కనుమ పండగను ఘనంగా జరుపుకుంటారు. ఈ కోట్స్ ద్వారా మీ కుటుంబ సభ్యులకు, బంధువులకు కనుమ శుభాకాంక్షలు చెప్పేయండి.
మిత్రులకు కనుమ పండుగ శుభాకాంక్షలు
మీకు మీ కుటుంబ సభ్యులకు కనుమ పండుగ శుభాకాంక్షలు
వ్యవసాయంలో తమతో పాటు కష్టించే పశువులను పూజించే పండుగ కనుమ, అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు
ఏడాది పొడవునా తమ కష్టంలో పాలు పంచుకునే పశువులను, రైతన్నలు పూజించే పండుగ కనుమ. తెలుగు ప్రజలందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు
వ్యవసాయంలో తమకు తోడుగా ఉన్న పశువులకు శుభాకాంక్షలు తెలిపే పండుగ. అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు