ఆగస్టు 26వ తేదీన ప్రపంచవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. భగవద్గీతను ప్రబోధించిన శ్రీకృష్ణుడు అంటే మతాలకు అతీతంగా ప్రపంచమంతట ఆరాధన భావం కొలువుతీరి ఉంది. శ్రీకృష్ణుని జగద్గురువు అని పిలుస్తారు. ఎందుకంటే భగవద్గీత ద్వారా ఆయన జీవిత సారాంశాన్ని ఈ ప్రపంచానికి చాటి చెప్పాడు. శ్రీకృష్ణ పరమాత్ముని లీలా విశేషాలు భాగవతంలో పొందుపరిచారు. మహాభారతంలోనూ శ్రీకృష్ణుడే కీలక పాత్రధారి కురుక్షేత్ర సంగ్రామాన్ని శ్రీకృష్ణుడే దగ్గరుండి ధర్మస్థాపన కోసం యుద్ధం చేయించాడు. అందుకే శ్రీకృష్ణుడంటే ప్రతి ఒక్కరిలోనూ ఆరాధన భావం కొలువుతీరి ఉంటుంది. శ్రీకృష్ణుడి జన్మదినం అయినటువంటి శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలియజేయాలి అనుకుంటే ఇక్కడ పేర్కొన్న కోట్స్ ఫోటో గ్రీటింగ్స్ వాడుకోండి.