ఈసారి కృష్ణ జన్మాష్టమి పండుగను ఆగస్టు 26, సోమవారం జరుపుకోనున్నారు. భాద్రపద మాసంలో కృష్ణ పక్షంలోని అష్టమి తిథి నాడు జరుపుకుంటారు. ఈ ఏడాది కృష్ణ జన్మాష్టమి మరింత ప్రత్యేకం కానుంది. కృష్ణ జన్మాష్టమి నాడు రెండు శుభ యోగాలు ఏర్పడతాయి. ఈ సమయంలో శ్రీకృష్ణుడిని ఆరాధించడం, ఉపవాసం ఉండడం ద్వారా శ్రీకృష్ణుడు మీ కోరికలను తీరుస్తాడు. కృష్ణ జన్మాష్టమి పూజల శుభ ముహూర్తాలు ఉదయం నుండే ప్రారంభం కానున్నాయి. ఈసారి ఆగస్టు 26న ఉదయం 5.55 గంటల నుంచి 7.36 గంటల వరకు పూజలు చేసేందుకు అనుకూలంగా ఉంది. రెండో శుభముహూర్తం 3:35 PM నుండి 7 PM వరకు పూజకు అనుకూలమైన సమయం.