Happy Maha Shivaratri Wishes Telugu: మాఘమాసమున, కృష్ణ పక్షమున, చతుర్ధశి నడి ఝాము రాత్రిన మహా లింగముగా , మహా శివరాత్రిగా మహిలో నిలిచిన మహా దేవుడి మహత్యాన్ని వేడుకగా జరుపుకునే పవిత్రమైన రోజే మహా శివరాత్రి. దీనినే 'శివరాత్రి' అని ప్రముఖంగా పిలుస్తారు. ఇదే రోజున పార్వతీపరమేశ్వరుల వివాహం జరిగిన రోజుగా కూడా చెప్తారు. శివం మరియు శక్తి ఏమైన రోజును ఇది సూచిస్తుంది. శివం అంటే ఆది- అంతం లేని- సమస్తం అనే అర్థం వస్తుంది.
చాంద్రమాన నెల లెక్క ప్రకారం, గ్రెగేరియన్ క్యాలెండర్లో శివరాత్రి ఫిబ్రవరి లేదా మార్చి నెలలో వస్తుంది. హిందువుల క్యాలెండర్ నెలలో ఫాల్గుణ మాసము యొక్క కృష్ణ పక్ష చతుర్దశి రోజున వస్తుంది. సంవత్సరంలో వచ్చే పన్నెండు శివరాత్రులలో మహా శివరాత్రి అత్యంత పవిత్రమైనదిగా భావింపబడుతుంది.
శివరాత్రి ప్రత్యేకంగా హిందువులకు విశిష్టమైన పండుగ. శివుడు (Lord Shiva) ఈరోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉంది. ఈరోజున ఆ ఆది దేవుడు పరమ శివుడిని భక్తి , శ్రద్ధలతో కొలుస్తూ జరుపుకుంటారు. ఆ భోలా శంకరుడి అనుగ్రహం కోరుతూ తెల్లవారుజామునే లేచి, తల స్నానం చేసి, పూజలు చేసి, రోజంతా ఉపవాసం ఉండి, రాత్రంతా జాగారం చేస్తారు. ఆ మరునాడు ఉపవాసం విడుస్తారు.
శైవక్షేత్రాలలో శివరాత్రి అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడుతుంది. శివ పూజలు, అభిషేకములు, అర్చనలు, శివలీలా కథాపారాయణలు జరుపుతారు. ఓం నమ: శివాయ, హరహర మహాదేవ శంభో శంకర అంటూ శివనామ స్మరణలో శివరాత్రి జరుగుతుంది.
శివుడు అనగా కల్మషము లేని వాడు. అంటే ప్రకృతి యొక్క (తమో, రజో, సత్వ) గుణాలేవీ అంటని వాడు. అందుచేత శివనామస్మరణం సకలజనులని పరిశుద్ధం చేస్తుందని పురాణాలు చెబుతాయి.
ఈ శివరాత్రి రోజున మీకు పరమశివుని కరుణాకటాక్షాలు కలగాలనే ఆకాంక్షతో శిననామస్మరణను స్పురించే సూక్తులు, శివరాత్రి సందేశాలు వాట్సాప్, ఫేస్బుక్ స్టేటస్, మహా శివరాత్రి శుభాకాంక్షలతో అందజేస్తున్నాం. మహా శివరాత్రి శుభాకాంక్షలు ఇంగ్లీష్‌లో పొందాలంటే ఈ లింక్ చూడండి.
Lord Shiva Quotes Telugu: సాంబశివ శంభోశంకర శరణం, మే తవ చరణయుగం శివాయ నమహో, శివాయ నమహా.. ఓం నమ శివాయ:
Lord Shiva Quotes Telugu: ముజ్జగాలు గాసే ముక్కంటుడా
కంఠంలో గరళాన్ని దాచుకొని, అమృతాన్ని పంచే నీలకంఠుడా
అడిగ్గానే వరాలిచ్చే భోలా శంకరుడా, నమోనమామి!
మహా శివరాత్రి శుభాకాంక్షలు
Lord Shiva Quotes Telugu: భీమా శంకరా.. ఓం కారేశ్వరా
శ్రీకాళేశ్వరా.. మా ఎములాడ రాజరాజేశ్వరా
మమ్మేలే మా ప్రాణేశ్వరా.. మా రక్ష నీవే ఈశ్వరా!
మహా శివరాత్రి శుభాకాంక్షలు
Lord Shiva Quotes Telugu:
ముజ్జగాలు మురియ, ముక్కంటి యాడుచు
వెండి కొండ పైన, వేడ్క గదురా
నర్త నంబు జేసె , నాట్య రాజటంచు
సర్వ జనులు శివుని, సంస్తుతించ !
Lord Shiva Quotes Telugu:
దోషదూషనాశ వినాశనా.. నాగభూశణా
సృష్టికారణ, నష్టహరణ తమోరజోసత్వగుణ విమోచనా
హరహర మహాదేవ శంభో శంకర!
ఈ మహా శివరాత్రి పర్వదినాన్ని మీరు, మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో కలిసి ఆనందంగా జరుపుకోవాలని, ఆ మహాదేవుని చల్లని చూపు మీపై ఉండాలని కోరుకుంటూ 'లేటెస్ట్‌లీ తెలుగు' తరఫున మహా శివరాత్రి శుభాకాంక్షలు.
May All Your Prayers Be Granted by Lord Shiva! Wishing You a Happy Maha Shivratri!