#HappyNewYear2023: విషాదాలను చరిత్రలోకి తీసుకువెళుతూ కొత్త సంవత్సరం వచ్చేసింది, ఈ ఏడాది అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ..న్యూ ఇయర్ సందర్భంగా ఆత్మీయులకు శుభాకాంక్షలు చెప్పేద్దామా..
నూతన సంవత్సర శుభాకాంక్షలు

గతేడాది అంతా కరోనామయమే..క్లుప్తంగా చెప్పాలంటే కరోనా ఏడాదిగా చెప్పుకోవచ్చు. మొత్తం ప్రపంచంమంతా దాదాపు ఏడాది పాటు కర్ఫ్యూలు, లాక్ డౌన్లతో ఓ విషాద సంవత్సరంగా చరిత్రలోకి జారుకుంది. ఈ కొత్త ఏడాది అయినా అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ అందరం ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది.

ఏ ఏడాది కూడా కరోనా తన ప్రభావాన్ని చూపించడానికి రెడీ అవుతున్న నేపథ్యంలో ఈ సంవత్సరం ఎలా ఉంటుందోనన్న భయం కూడా వెంటాడుతోంది. యుకెలో కొత్త రూపాన్ని సంతరించుకున్న కరోనావైరస్ (Coronavirus Year) మళ్లీ పడగవిప్పి బుస కొట్టేందుకు రెడీ అవుతోంది. అయినా న్యూ ఇయర్ వేడుకలను మాత్రం ఆపకుండా సెలబ్రేట్ చేసుకోమంటూ కొన్ని రాష్ట్రాలు ఉత్తర్వులు జారీ చేశాయి.

ఇక కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు సహా పలు చోట్ల ప్రభుత్వాలు రాత్రి కర్ఫ్యూను అమల్లోకి తెచ్చాయి. నూతన సంవత్సర సందర్భంగా ప్రజలు గుంపులుగా గుమిగూడకుండా చూసేందుకు డిసెంబర్‌ 31, జనవరి 1 తేదీల్లో రాత్రి 11 నుంచి పగలు 6గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది.

ఏదేమైనా.. 2022లో ఎదురైన చేదు అనుభవాలకు వీడ్కోలు చెప్పి.. సరికొత్త ఆశలతో 2021కు (#HappyNewYear2023) ఆహ్వానం పలికే సమయం ఆసన్నమైంది. రానున్న ఈ కొత్త సంవత్సరంలోనైనా అందరి జీవితాలు బాగుపడాలని మనసారా కోరుకుందాం. ఈ నేపథ్యంలో మీకు కొన్ని అందమైన న్యూ ఇయర్ విషెస్‌ను ఇక్కడ అందిస్తున్నాం. వాటిని మీ శ్రేయోభిలాషులతో షేర్ చేసుకుని కొత్త ఏడాదిలో మంచి జరగాలని కోరుకోండి. జనవరి 1న (Happy New Year 2023) ఈ అందమైన కోట్స్‌తో మీ బంధుమిత్రులకు న్యూ ఇయర్ విషెస్ చెప్పండి.

మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు

ఈ సంవత్సరం నీకు అప్రతిహతమైన గెలుపునందించే సంవత్సరం కావాలని ఆశిస్తూ...నూతన సంవత్సర శుభాకాంక్షలు.

ఈ కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరికీ మంచి జరగాలని, అందరూ సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలని దేవుడిని కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 20213మనకు గొప్ప విజయాలను, శ్రేయస్సును, మంచి ఆరోగ్యాన్ని అందిస్తుందని ఆశిస్తున్నాను

2023 కొత్త సంవత్సరంలో భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

గత సంవత్సరం కరోనా నామ సంవత్సరంగా మిగిలిపోయింది. అయితేనేం దేశం ఒక మహా విపత్తును ధైర్యంగా ఎదుర్కొంది. ఎంతో ఆత్మవిశ్వాసంతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం మనం. ఈ సంవత్సరం మీ ఇంటిల్లిపాదికీ చిరునవ్వులను పంచాలని కోరుకుంటూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు