
Happy New Year 2023 Wishes in Telugu: కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2023 కొత్త సంవత్సరంలో మీ అందరికీ శుభములే కలగాలని కాంక్షిస్తూ మీ అందరికీ విషెస్ చెబుతోంది లేటెస్ట్‌లీ, పాత సంవత్సరంలొ జరిగిన తప్పుల్ని సరిదిద్దుకుని తిరిగి కొత్త ఏడాది మరింత ఉత్సాహంతో ముందుకు సాగాలని కోరుకుంటోంది. గత ఏడాదంతా కరోనా మహమ్మారి వల్ల అందరూ ఆర్థికంగా చాలా నష్టపోయారు. అలాగే చాలామంది ఆప్తులను కూడా పొగొట్టుకున్నారు. ఇప్పుడిప్పుడే అందరూ ఈ విషాదాల నుంచి బయటపడుతున్నారు. అయితే రానున్న ఏడాది కూడా మళ్లీ కరోనా ముప్పు పరిస్థితులను కల్పిస్తోంది.
ఈ నేఫథ్యంలోనే దేశంలో చాలా రాష్ట్రాల్లో వేడుకలపై ఆంక్షలు విధించారు. ఇంట్లోనే ఉంటూ జాగ్రత్తగా వేడుకలు జరుపుకోవాలని చెబుతున్నారు. కొత్త వేరియంట్ విస్తరిస్తున్న తరుణంలో అందరూ బయట మాస్కులు ధరించి, భౌతిక దూరాన్ని పాటిస్తూ వేడుకలు జరుపుకోవాలని అటు పోలీసులు, ఇటు ఆప్తులు కోరుతున్నారు. రానున్న ఏడాది అందరి సమస్యలు తొలిగి చిరునవ్వులతో గడిపేయాలని కోరుకుంటూ ఈ కోట్స్ తో మీ బంధువులకు స్నేహితులకు శుభాకాంక్షలు చెప్పేయండి.
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు

మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

ఉప్పొంగిన ఉత్తేజంతో కొత్త సంవత్సరాన్ని స్వాగతిద్దాం, అవధులు లేని ఉత్సహాంతో పండగ చేద్దాం, నూతన సంవత్సర శుభాకాంక్షలు

ఎన్నో ఆశలను మోసుకువస్తున్న కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

మధురమైన ప్రతిక్షణం నిలుస్తోంది జీవితాంతం, రాబోయే కొత్త సంవత్సరానికి సుస్వాగతం పలుకుతూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు
