kids bp

ఈ రోజుల్లో చిన్న వయసులో ఉన్న వాళ్ళు కూడా బీపీ సమస్యతో బాధపడుతున్నారు. ఈ బీపీ సమస్య ఉన్నవారికి గుండె సంబంధ, మెదడుకు సంబంధించిన తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అయితే మీ జీవనశైలిలో మార్పుల కారణంగా ఈ హైబీపీని తగ్గించుకోవచ్చు. హై బీపీ ఉన్నవారు ఈ కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

సాల్టెడ్ స్నాక్స్- ఈ సాలిటెడ్ స్నాక్స్ లో సోడియం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా చిప్స్, సాల్టెడ్ వేరుశనగలు, భుజియా వంటి స్నాక్స్ లలో సోడియాన్ని ఎక్కువగా వినియోగిస్తారు. దీని ద్వారా మీకు రక్తపోటు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి బిపి ఉన్నవారు ఈ పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది.

ప్యాకెట్ జ్యూస్- ప్యాకెట్ జ్యూస్ లలో సోడియం ,షుగర్ ఎక్కువగా ఉంటుంది. వీటిలో నేచురల్ పండ్లకు బదులుగా వీటి రుచిని పెంచడానికి ఎక్కువ చక్కెరను కలుపుతారు. దీని ద్వారా మీ రక్తపోటు పెరుగుతుంది. షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల మీరు వీటికి దూరంగా ఉండాలి. తాజా పండ్లను తీసుకోవడం ఉత్తమం.

Health Tips: అధిక కొలెస్ట్రాల్ తో బాధపడుతున్నారా

పిజ్జా బర్గర్- పిజ్జా బర్గర్ డోనట్స్ వంటి వాటిని అస్సలు తీసుకోకూడదు ఇందులో ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి అంతేకాకుండా వీటిలో అధికంగా కొవ్వు కూడా ఎక్కువగా ఉంటుంది వీటి ద్వారా మీ రక్తపోటు అమాంతం పెరుగుతుంది బీపీ పేషెంట్లు ఎట్టి పరిస్థితుల్లో వీటిని మానివేయడం ఉత్తమం.

అధిక కొవ్వు ఉన్న పాల ఉత్పత్తులు- బీపీ ఎక్కువగా ఉన్నవారు కొవ్వు ఎక్కువగా ఉన్న పాలను పాల ఉత్పత్తులను, చీజ్, క్రీమ్ వంటి వాటికి దూరంగా ఉండాలి. వీటిలో అధిక మొత్తంలో కొవ్వు కలిగి ఉంటాయి. ఇవి మీ రక్తపోటును పెంచుతాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండడం మంచిది.

బీపీ ఎక్కువగా ఉన్నవారు తీసుకోవలసిన ఆహారం

బీపీ ఎక్కువగా ఉన్నవారు తాజా పండ్లను కూరగాయలను తీసుకోవాలి. వీటిల్లో సోడియం తక్కువగా ఉంటుంది. ఓట్స్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది మీ రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. మొలకెత్తిన గింజలను తీసుకోవడం కూడా చాలా ఆరోగ్యకరం ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. కొవ్వులు తక్కువగా ఉండడం ద్వారా మీ రక్తపోటును తగ్గించి మీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఉడికించిన కోడి గుడ్డు తీసుకోవడం కూడా ఇది మంచి ప్రోటీన్ కి మూలం. ఇది మీ రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి