Holi 2023 Wishes: హోలీ శుభాకాంక్షలు ఈ కోట్స్‌తో చెప్పేద్దామా, మిత్రులకు, కుటుంబసభ్యులకు పంపేందుకు బెస్ట్ వాట్సప్ హోలీ మెసేజెస్, స్టిక్కర్స్ మీకోసం..
Holi-Wishes-in-Telugu_7

Happy Holi 2023 Wishes in Telugu: దేశ‌వ్యాప్తంగా హోలీ వేడుక‌లు మొద‌ల‌య్యాయి. ఒక్క‌రోజు ముందు నుంచే రంగుల పండుగ‌ను (Holi 2022 Wishes) స‌ర‌దాగా గ‌డుపుకున్నారు. ఒక‌రిపై ఒక‌రు రంగులు చ‌ల్లుకుంటూ ఎంజాయ్ చేశారు. హోలీ (Holi) సందర్భంగా హైదరాబాద్‌ నగరంలో పోలీసులు ఆంక్షలు విధించారు. రాజధానిలో బహిరంగ ప్రదేశాల్లో హోలీ వేడుకలు నిర్వహించడంపై నిషేధం విధించారు. పరిచయం లేనివారిపై రంగులు వేయ్యకూడదని, వాహనాలు, భవనాలపై కలర్లు పోయకూడదని హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

హోలీ (Happy Holi) పండుగ అంటే రంగులు చల్లుకోవడం.. కోలాటం ఆటలు.. గ్రామాల్లో అయితే రెండు కర్రలు(కోలలు) పట్టుకుని ఒక్కో గ్యాంగ్​ (కొంతమంది పిల్లలు) ఊరంతా తిరుగుతూ పాటలు పాడి.. తోచిన కాడికి విరాళాలు సేకరిస్తారు. ఆ వచ్చిన అమౌంట్​తో హోలీ పండుగనాడు కావాల్సిన రంగులు తెచ్చుకుని సంబురాలు చేసుకుంటారు.

హోలీ పండుగను వసంత ఋతువు ఆగమనంగా పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఇది చలికాలం తొలగి పోయి ఎండాకాలం ఆరంభానికి నాంది ప్రస్థావన వంటిది. హోలీ పండుగను సాధారణంగా “ఫాల్గుణి పూర్ణిమ” నాడు జరుపుకుంటారు. ఇలా ఒక రుతువు వెళ్లి మరో రుతువు వచ్చే సమయంలో ముఖ్యంగా శీతాకాలం ‘చలి’ వెళ్లిపోయి ఎండాకాలం ‘వేడి’ వచ్చే సమయంలో ఉష్ణోగ్రతల తేడావల్ల చర్మం చిట్లుతుంది. రంగులు ఆ చిట్లటం వల్ల కలిగే చికాకును తగ్గిస్తాయి.

అప్పుల ఊబిలో కూరుకుపోయారా, అయితే హోలీ రోజు ఈ పని చేస్తే మీకు పట్టిన దరిద్రం చిటికెలో వదిలిపోతుంది..

హోలీ అంటే రంగులు చల్లుకోవడం, కాముడి దహనం.. వంటివి ఎన్నో మనకు తెలుసు అసలు హోలీ పండుగ ఎందుకు వచ్చింది. దీని వెనుక ఉన్న పురాణ కథలు, ఆచరణాత్మకమైన వివరాలు ఏంటి.. ప్రచారంలో ఉన్న కథలను చదివి తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం భక్త ప్రహ్లాదున్ని చంపడానికి ప్రయత్నం చేసిన హిరణ్యకశ్యపుని చెల్లెలైన హోలిక అనే రాక్షసి దహనానికి సంకేతంగా సంప్రదాయ భోగి మంటలను వేస్తారు.

విజయదశమి రోజున రావణుడిని ప్రతిమను దహనం చేసినట్లు ఈ పండుగ రోజు కూడా ప్రతిమను దహనం చేస్తారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో రాక్షసుల పరాక్రమం హోలిక దహనంతో అంతమయిందని దీని అర్థం. బ్రజ ప్రాంతాలలో, కర్రలను కుప్పగా చేసి ప్రజలు ఎక్కువగా తిరిగే కూడళ్లలో, వీధి చివరలో ప్రతిమలను దహనం చేస్తారు. సంప్రదాయమైన పూజల తరువాత ప్రజలు మంటల చుట్టు ప్రదక్షిణ చేస్తారు. తరువాత రోజు ఈ విజయాన్ని దుల్‍‌హెండి రోజుగా ఘనంగా జరుపుకుంటారు.

హోలీ రోజున ఏ రాశి వారు, ఏ రంగులతో పండుగ చేసుకోవాలో తెలుసుకోండి, మీ రాశికి తగిన రంగుతో హోలీ ఆడితే జీవితంలో అదృష్టం కలిసి వస్తుంది..

హోలీ పుట్టుక వివరాల గురించి మరో కథ కూడా ఉంది. ఈ కథ ప్రేమ దేవుడైన కామదేవుడు గురించి తెలుపుతుంది. పార్వతి శివుణ్ణి పెళ్లి చేసుకోవడానికి సహాయంగా శివుని తపస్సును భంగపరచడానికి అతనిపై పూల బాణం వదిలిన కామదేవుని శరీరాన్ని శివుడు నాశనం చేసాడు. తరువాత శివుడు, తన త్రినేత్రాన్ని తెరిచి, కామదేవుని శరీరాన్ని బూడిద చేశాడు.

కామదేవుని భార్య రతి కోరికమేరకు శివుడు కామదేవుడిని మళ్లీ బతికిస్తాడు కానీ, భౌతిక కామం కంటే నిజమైన ఉద్రేక పూరితప్రేమ ఆధ్యాత్మికతను తెలియజేసే మానసిక ప్రతిరూపంగా మాత్రమే బతికిస్తాడు. ఈ సంఘటన వలన హోలీ రోజున భోగి మంటలు వేసి ఘనంగా జరుపుకొంటారు. ఈ పండుగను భగవంతుడైన కృష్ణుడి పెరిగిన ప్రాంతాలైన మథుర, బృందావనంలలో 16 రోజులపాటు ఘనంగా జరుపుకొంటారు. హోలీ శుభాకాంక్షలు తెలిపే మెసేజెస్ కోట్స్ మీకోసం

Holi-Wishes-in-Telugu_1

. రంగుల పండుగ వచ్చింది.. అందరిలో ఆనందాన్ని తెచ్చింది. మీకు, మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు

చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తు ఈ హోలీ. అందరికీ హోలీ శుభాకాంక్షలు
Holi-Wishes-in-Telugu_2

చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తు ఈ హోలీ. అందరికీ హోలీ శుభాకాంక్షలు

Holi-Wishes-in-Telugu_3

సుఖం, దుఃఖం, సంతోషాలకు ప్రతీకే ఈ రంగుల పండగ మీకు, మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు

Holi-Wishes-in-Telugu_4

వినోద సంబరాల రంగుల పండుగ. అందరికి హోలీ శుభాకాంక్షలు

Holi-Wishes-in-Telugu_5

అన్ని రంగులు ఉంటేనే ప్రకృతికి అందం, అన్ని మతాలు కలిసుంటేనే దేశానికి అందం. అందరికి హోలీ శుభాకాంక్షలు

Holi-Wishes-in-Telugu_6

హోళీ  రోజున ఒకరిపై ఒకరు చల్లుకునేది రంగులు కావు, అనురాగ, ఆప్యాయతలు కలిగిన పన్నీటి రంగులు. అందరీకి హోలీ శుభాకాంక్షలు

Holi-Wishes-in-Telugu_7

 మీకు, మీ కుటుంబ సభ్యులకు లేటెస్ట్‌లీ తరపున హోలీ శుభాకాంక్షలు