International Men's Day Wishes: అంతర్జాతీయ పురుషుల దినోత్సవం కొటేషన్లు, మగవారికి అంతర్జాతీయ పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు చెప్పేయండి ఇలా..
International Men's Day 2021 Wishes (Photo Credits File Photo)

వినాపురుష జననం నాస్తి, వినాపురుష మరణం నాస్తి వినా పురుష జీవం నాస్తి వినాపురుష ఏవం నాస్తి అన్నాడు ఓ మగజాతి ఆణిముత్యం. అంటే ఈ సృష్టిలో ఆడవారికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో, మగవారికీ అంతే ఉంటుంది అనే అర్థం వస్తుంది. ఆకాశంలో సూర్యుడు, చంద్రుడు ఈ భూమి మీద మగాడు, రేయింబవళ్లు కష్టపడి ఈ సృష్టిని ముందుకు నడపడంలో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. మరి అలాంటి మగవారి కోసం ఒక గుర్తింపంటూ ఉండకూడదా? అందుకే ప్రపంచవ్యాప్తంగా ఈరోజు నవంబర్ 19న అంతర్జాతీయ పురుషుల దినోత్సవం (International Men's Day) గా నిర్వహిస్తున్నారు.

మగవారి ఆరోగ్యం, మగవారితో సత్సంబంధాలు మెరుగుపరచటం, మగ- ఆడ మధ్య సమానత్వాన్ని ప్రోత్సహించడం, పురుషుల పట్ల వివక్షతను ఎత్తిచూపడం, మగజాతి ఆణిముత్యాలను (role models) అందరికీ పరిచయం చేస్తూ, వారు సాధించిన విజయాలను మరియు ఘనతలను ఈ ప్రపంచానికి తెలియచెప్పటమే లక్ష్యంగా ఈ పురుషుల దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం నవంబరు 19 న అంతర్జాతీయ స్థాయిలో జరుపబడే ఉత్సవం.

మగజాతి ఆణిముత్యాల్లారా.. పండగ చేస్కోండి, ఈరోజు మీరోజు. నేడు ప్రపంచ పురుషుల దినోత్సవం, ఈరోజుకున్న విశిష్టత ఎంటో తెలుసుకోండి

1992 ఫిబ్రవరి 7న ప్రొఫెసర్ థామస్ ఓస్టర్ చే ఈ దినము ప్రారంభించబడినప్పటికీ, ట్రినిడాడ్ , టొబాగో దేశస్థులు దీనికి కొత్త ఊపిరులు ఊదారు.దక్షిణ ఐరోపాకు చెందిన మాల్టా దీవిలో ఈ ఉత్సవాన్ని 1994 ఫిబ్రవరి 7 నుండి క్రమం తప్పక జరుపుతున్నారు. ఈ ఉత్సవాన్ని సుదీర్ఘ కాలంగా జరుపుతున్నది మాల్టా వారే. ఇది ఐక్య రాజ్య సమితి (United Nations) ఆమోదంతో మొదటగా ట్రినిడాడ్ , టొబాగోలో 1999 లో ప్రారంభించబడింది.

అంతర్జాతీయ పురుషుల దినోత్సవం శుభాకాంక్షలు తెలిపే మెసేజెస్

1. ఒక తండ్రిగా, అన్నగా, తమ్ముడిగా, గురువుగా, స్నేహితుడిగా భర్తగా..ఇలా ఒక్కో కోణంలో జీవితంలే పయనించే అందరి మగవాళ్లకు అంతర్జాతీయ పురుషుల దినోత్సవం శుభాకాంక్షలు

2. నిజమైన మగవాడికి ఉండటమంటే ప్రేమించడం నేర్చుకోవడం, మీకు అవసరమైన ప్రతి ఒక్కరికీ సహాయం చేయడం. అంతర్జాతీయ పురుషుల దినోత్సవం శుభాకాంక్షలు

3. అంతర్జాతీయ పురుషుల దినోత్సవం శుభాకాంక్షలు

4. మగవాడికి హక్కులు ఉంటాయని తెలుపుకునే రోజు ఈ రోజు అంతర్జాతీయ పురుషుల దినోత్సవం శుభాకాంక్షలు

5. మీరు నా జీవితంలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నారు. అంతర్జాతీయ పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు!

6.నా జీవితంలోని పురుషులందరికీ అంతర్జాతీయ పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు. మీరు ఈ రోజు, ఎల్లప్పుడూ ప్రేమించబడ్డారు. ప్రశంసించబడ్డారు!

7. ప్రేమ, గౌరవం ఆధారంగా తన బోధనలను అనుసరించడానికి దేవుడు మనుషులను సృష్టించాడు, మనుషులందరూ అలా చేయాలి. ఎందుకంటే భూమి జీవించడానికి మంచి ప్రదేశం. అంతర్జాతీయ పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు!

8. పురుషులందరి అందం ఏమిటంటే ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేక నాణ్యత ఉంటుంది. మీరు వారి నిజమైన హృదయాన్ని కనుగొన్నప్పుడు అది అపురూపంగా ఉంటుంది. అంతర్జాతీయ పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు!

9. ఒక మనిషి తాను నమ్మిన జీవితాన్ని జీవించే హక్కును నిరాకరించినప్పుడు, అతను చట్టవిరుద్ధంగా మారడం తప్ప వేరే మార్గం లేదు.

అప్పటికే అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపబడుతుండటం పితృ దినోత్సవం జరుపుబడుతున్ననూ, తండ్రికాని పురుషులకంటూ ఒక దినోత్సవం లేకపోవటం, ఈ దినోత్సవ ఆలోచనకు దారి తీశాయి. పురుషులు దుర్మార్గులనే మూసలో ఇరికించబడటం కంటే ఆదర్శ పురుషుల గురించి తెలుసుకొనటంలోనే అన్ని వయస్కుల పురుషులు ఉత్సాహంగా ప్రతిస్పందిస్తారని అంతర్జాతీయ పురుషుల దినోత్సవం ఋజువు చేయటానికి ప్రయత్నం చేస్తోంది. తరచూ చెడుగా ప్రవర్తించే పురుషుల ప్రతిబింబాలతో నింపేసి సంఘాన్ని ఆకర్షిస్తోన్న సందర్భంలో ఈ (దినోత్సవ) ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఈ ఉత్సవాన్ని 70కి పైగా దేశాలు ఈ దినోత్సవాన్ని జరుపుకొంటున్నాయి.

అంతర్జాతీయ పురుషుల దినోత్సవం జరుపటం నేపథ్యంలో గల ప్రాథమిక లక్ష్యాలు:

ఆదర్శ పురుషుల గురించి ప్రత్యేకించి తెలుపటం

కేవలం సినిమా తారలనో, క్రీడాకారులనో మాత్రమే కాక, దైనందిన జీవితంలో కాయకష్టం చేసుకునైనా సరే గౌరవప్రదమైన నిజాయితీపరమైన జీవితాలు గడిపేవారి గురించి కూడా చెప్పటం

సంఘానికి, వర్గానికి, కుటుంబానికి, వైవాహిక వ్యవస్థకు, శిశు సంరక్షణకు , పర్యావరణకు పురుషులు ఒనగూర్చిన ప్రయోజనాలను గుర్తించటం

పురుషుల సాంఘిక, భావోద్వేగ, శారీరక , ఆధ్యాత్మిక ఆరోగ్యంపై దృష్టి సారించటం

సాంఘిక సేవలలో, విలువలలో, అంచనాలలో , చట్టాలలో పురుషులేదుర్కొంటూన్న వివక్షను చాటటం

స్త్రీ-పురుషుల మధ్యన సఖ్యత, సరైన సంబంధాలను నెలకొల్పటం

లింగ సమానత్వాన్ని వ్యాపింపజేయటం

హాని గురించిన తలంపులు లేని, పరిపూర్ణ అభివృద్ధికి అవకాశాన్నిచ్చే సురక్షితమైన ప్రపంచం రూపొందించటానికి కృషి చేయటం