
International Women's Day Telugu Messages: మహిళలను ఆకాశంలో సగం అవనిలో సగం అంటారు. అటువంటి మహిళా లోకం శక్తికి ప్రతీకగా నిర్వహించే పండుగ, మహిళలంతా సంతోషంగా జరుపుకునే వేడుక, మహిళా సాధికారత దిశగా నడిపించటం కోసం నిర్వహించే సంబరమే అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ప్రతి ఏడాది మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్మిక ఉద్యమం నుండి పుట్టుకొచ్చింది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపే మెసేజెస్, వాట్సప్ స్టిక్కర్స్, వాట్సప్ స్టేటస్ మీకోసం
దాదాపు శతాబ్దానికి ముందు నుంచే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు మార్చి 8వ తేదీన మహిళలకు ప్రత్యేకమైన రోజుగా గుర్తించి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుతున్నారు. 1908లో తక్కువ పనిగంటలు, మెరుగైన జీతం, ఓటు వేసే హక్కు కోసం యూఎస్ లోని న్యూ యార్క్ సిటీలో 15 వేల మంది మహిళలు ప్రదర్శన చేశారు. నాడు మహిళల డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని అమెరికాలోని సోషలిస్టు పార్టీ 1909వ సంవత్సరంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది.అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపే మెసేజ్ లు మీ కోసం..

అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు

అమ్మను పూజించు..భార్యను ప్రేమించు.. సోదరిని దీవించు.. ముఖ్యంగా మహిళలను గౌరవించు’’ - హ్యాపీ ఉమెన్స్ డే

చరిత్ర సృష్టించాలంటే సమాజం దృష్టిలో మంచి నడవడిక ఉండక్కర్లేదు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు

ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువైవుంటారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు.