Mahatma-Gandhi-Jayanthi-Quotes

నేడు మహాత్ముడి 76వ వర్ధంతి. అహింసా, సత్యాగ్రహాలే ఆయుధాలుగా దేశానికి స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు అందించిన మహనీయుడు జాతిపిత మహాత్మా గాంధీ. సర్వజన హితం నా మతం.. అంటరానితనాన్ని అంత: కలహాలను అంతం చేసేందుకు నా ఆయువు అంకితం అంటూ జాతిపిత మహాత్మా గాంధీ (Mahatma Gandhi Vardhanthi) సందేంశం ఇచ్చారు. నిత్యం అహింసాయుత మార్గంలో సత్యమే పరమావధిగా జీవించిన మహనీయుడు. అదే మార్గంలో భారతావనికి స్వాతంత్య్రం సంపాదించిన మహనీయుడు.

1948 జనవరి 30వ తేదీన బిర్లా హౌస్ వద్ద రోజూ చేసే ప్రార్ధనల నుంచి బయటకు వస్తుండగా నాథూరామ్ గాడ్సే అందరి ఎదుటే మహాత్ముడిపై కాల్పులు జరిపాడు. హే రామ్ అంటూ గాంధీ ప్రాణాలు విడిచాడు.మహాత్ముడి వర్ధంతి రోజును దేశం మొత్తం షహీద్ దివస్‌గా జరుపుకుంటుంది.

గాంధీ జయంతి శుభాకాంక్షలు, మీ స్నేహితులు, సన్నిహితులకు వాట్సప్ ద్వారా విషెస్ తెలపాలని అనుకుంటున్నారా, అయితే ఫోటో సందేశాలు మీ కోసం..

దేశ రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, రక్షణ శాఖ మంత్రి అందరూ ఢిల్లీలోని రాజ్‌ఘాట్ (Rajghat) వద్ద నివాళులర్పిస్తారు.జాతిపితగా కీర్తించిన గాంధీ ప్రాణాలర్పించిన రోజు కావడంతో మార్టిర్స్ డే (Martyrs Day) జరుపుకుంటారు. మహాత్మా గాంధీ చేసిన పోరాటం ప్రపంచమంతటినీ కదిలించింది. జాతి సమగ్రతను, ఐక్యతను నిలబెట్టేందుకు గాంధీ అనుసరించిన మార్గం అందరికీ నేటికీ ఆదర్శమై నిలిచింది.

భరతమాత తలరాతను మార్చిన విధాత మన గాంధీజీ.. గుజరాత్ లోని పోరుబందర్ లో జన్మించి, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు స్వతంత్ర కాంక్ష రగిలించి, భారతీయులందరిని ఒకే తాటిపై నడిపించి, సూర్యుడు అస్తమించని రాజ్యాన్ని పడమర దిక్కున పారద్రోలి భరతమాతను బానిస సంకెళ్ళ నుంచి విడిపించి స్వేచ్ఛా వాయువును మనకందించారు మన జాతి పిత మహాత్మాగాంధీ. ఆయన ఆశయాలను కొనసాగిద్దాం, స్వేచ్చకు సరికొత్త నిర్వచనంతో ముందుకు సాగుదాం.