మిలాద్ ఉన్ నబి పర్వదినం సందర్భంగా మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలియజేయాలి అనుకుంటున్నారా.. అయితే ఇక్కడ చక్కటి ఫోటో గ్రీటింగ్స్ ద్వారా మీరు మీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు తెలియజేయవచ్చు. ముందుగా మిలాద్ ఉన్ నబి పర్వదినం గురించి తెలుసుకుందాం. ప్రవక్త మహమ్మద్ జన్మదినాన్నే మిలాద్ ఉన్ నబి పండగ అంటారు. ఈ రోజున ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఈ పండుగ ఇస్లామిక్ ప్రజలను ఐక్యతతో బంధిస్తుంది మరియు ప్రవక్త బోధనలను గుర్తుంచుకోవడానికి వారికి అవకాశం కల్పిస్తుంది. ఇది కాకుండా, ఈ పండుగ ముస్లిం ప్రజలను సామాజిక సేవ కోసం ప్రేరేపిస్తుంది. పేదలకు సహాయం చేయడానికి వారిని ప్రోత్సహిస్తుంది. ఈద్ మిలాద్-ఉన్-నబీ చరిత్ర ఇస్లామిక్ మత ప్రవక్త హజ్రత్ ముహమ్మద్ సాహిబ్ జననంతో ముడిపడి ఉంది. హజ్రత్ ముహమ్మద్ సాహిబ్ క్రీ.శ.570లో మక్కాలో జన్మించారు. సున్నీ ప్రజలు ముహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని రబీ అల్-అవ్వల్ 12న జరుపుకుంటారు, అయితే షియా ప్రజలు ఈ పండుగను 17న జరుపుకుంటారు.
Milad Un Nabi 2024 Wishes In Telugu: మహమ్మద్ ప్రవక్త బోధనలను అనుసరిస్తూ సుఖ, సంతోషాలతో ముస్లింలంతా జీవనం గడపాలని, ప్రవక్త జన్మదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని కోరుకుంటూ.. ముస్లిం సోదర, సోదరీమణులందరికీ మిలాద్ ఉన్ నబి శుభాకాంక్షలు..
మహ్మద్ ప్రవక్త జన్మదినాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహాల నడుమ జరుపుకుంటున్న ముస్లిం సోదర సోదరీమణులందరికీ మిలాద్-ఉన్-నబీ పండుగ శుభాకాంక్షలు.
మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్బంగా ముస్లిమ్ సోదర సోదరీమణులందరికీ "మిలాద్-ఉన్-నబీ" పండుగ శుభాకాంక్షలు
సమాజాన్ని హింసా ప్రవృత్తి నుంచి విముక్తం చేసి, శాంతియుత సహజీవనానికి, నవ నాగరికతకు అంకురార్పణ చేసిన దివ్య చరితుడు మహమ్మద్ ప్రవక్త జన్మదినమైన మిలాద్ - ఉన్ - నబీని ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్న ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు.
ప్రపంచ శాంతి కోసం మానవాళికి విలువైన సందేశాలు ఇచ్చిన మహోన్నత వ్యక్తి మహ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులకు మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు.
దాతృత్వం, క్రమశిక్షణ,శాంతి, సోదర భావాలతో మనుగడ సాగించడం దైవత్వంతో సమానమని.. దివ్య ఖురాన్ బోధనలతో మానవాళిని ప్రభావితం చేసి సమాజాన్ని హింస, ద్వేషాల నుంచి విముక్తి చేసి.. శాంతివైపు నడిపిన మహోన్నత వ్యక్తి మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా.. ముస్లిం సోదర సోదరీమణులందరికీ "మిలాద్ - ఉన్ - నబీ" శుభాకాంక్షలు. ఆయన చూపిన శాంతి, ఐక్యత, మానవతా మార్గాల నుంచి స్ఫూర్తిని పొందుదాం. పేదలకు, నిస్సహాయులకు అండగా నిలుద్దాం.