Shab-e-Meraj-Wishes-in-Telegu

ఇస్లామీయ సాంప్రదాయాలలో ఇస్రా, మేరాజ్ అనునవి సా.శ. 621 (1 హిజ్రీ పూర్వం) మహమ్మదు ప్రవక్త గారి షబ్-ఎ-మేరాజ్ న ఆరోహణాకార్యక్రమాల రెండు భాగాలు. మహమ్మదు ప్రవక్త భౌతికంగా మేరాజ్ ప్రయాణం చేశారని చాలామంది ముస్లిం పండితుల అభిప్రాయం. కొందరైతే ఆత్మపరంగా మేరాజ్ ప్రయాణం చేశారని భావిస్తారు. క్లుప్తంగా ఈ ప్రయాణ సారాంశాన్ని ఖురాన్ లోని అల్-ఇస్రా సూరాలో 1 నుండి 60 సూక్తులలో వర్ణింపబడింది. ఇతరత్రా విషయాలు హదీసులలో నుండి లభించాయి.ఈ సారి భారత్ లో ఫిబ్రవరి 19న షబ్-ఎ-మేరాజ్ ముబారక్ జరుపుకుంటున్నారు.

లైలతుల్-మేరాజ్ లేదా షబ్-ఎ-మేరాజ్ (Shab-e-Miraj) ప్రపంచంలోని అన్ని దేశాలలోని ముస్లింలు ఘనంగా జరుపుకుంటారు. ఈ పర్వాన మస్జిద్ లకు దీపాలతో అలంకరిస్తారు. రాత్రంతా జాగారం జేస్తూ ప్రార్థనలు చేస్తారు. ఇస్రా, మేరాజ్ ల కథ వివరింపబడుతుంది. మహమ్మదు ప్రవక్త ఏ విధంగా అల్లాహ్ను కలవడానికి జిబ్రయీల్తో బుర్రాఖ్ పై ప్రయాణ మయ్యారు, వారి ప్రయాణం యేవిధంగా జరిగింది, అల్లాహ్, మహమ్మద్ ల మధ్య సంభాషణ, వాటి విషయాలు యేవి ఇవన్నియూ ప్రసంగరూపంలో సాగుతాయి.

రోజుకు 5 సార్లు నమాజ్ చెయ్యాలని అల్లాహ్ ఆదేశించిన రోజు, లైలతుల్-మేరాజ్ లేదా షబ్-ఎ-మేరాజ్ ఎందుకు జరుపుకుంటారు, ఎలా జరుపుకుంటారు

ఈ రాత్రిప్రయాణం జరిగి అల్లాహ్ తో సంభాషించిన తరువాత అల్లాహ్, మహమ్మదు ప్రవక్త ఆయన అనుచరులంతా రోజుకు అయిదు సార్లు నమాజ్ చెయ్యాలని ఆదేశిస్తాడు. ఈ సందర్భంగా ముస్లీం సోదరులకు విషెస్ చెప్పేయండి ఈ మెసేజ్‌లతో..

మీకు మీ కుటుంబ సభ్యులకు షబ్-ఎ-మేరాజ్ శుభాకాంక్షలు

Shab-e-Meraj-Wishes-in-Telegu

షబ్-ఎ-మేరాజ్ శుభాకాంక్షలు

Shab-e-Meraj-Wishes-in-Telegu

ముస్లిం సోదరులకు షబ్-ఎ-మేరాజ్ శుభాకాంక్షలు

Shab-e-Meraj-Wishes-in-Telegu

ముస్లిం మిత్రులకు లేటెస్ట్‌లీ  తరపున షబ్-ఎ-మేరాజ్ శుభాకాంక్షలు