
Hyderabad, Nov 11: జీవితంలోని చీకట్లను పారద్రోలి వెలుగులు నింపేదే దీపావళి (Diwali). దీపావళి అంటేనే సరదాలు, సంబరాలు, దీపాల వెలుగులు, బాణాసంచాల జిలుగులు, కుటుంబం అంతా కలిసి జరుపుకునే వేడుక. దీపావళి అంటేనే కాంతులు నింపే పండుగ (Festival). అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని, దీపాలను వెలిగించి, ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నిండాలని ఆకాంక్షించే పండుగ దీపావళి (Deepavali). అలాంటి ఈ పర్వదినం నాడు మీ బంధువులు, స్నేహితులు, ఆప్తులకు లేటెస్ట్ లీ అందించే ఈ స్పెషల్ కార్డ్స్ ద్వారా శుభాకాంక్షలు చెప్పెయ్యండి.






