Diwali Greetings in Telugu: హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగలలో, భారతీయులు అత్యంత భక్తి శ్రద్ధలతో, అత్యంత ఇష్టంగా జరుపుకునే పండుగలలో దీపావళి ఒకటి. ఆశ్వయుజ మాసంలో కృష్ణ పక్షంలో దీపావళి పండుగను జరుపుకుంటారు. దీపావళి అంటేనే వెలుగుల పండుగ. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నిండాలని సూచించేదే దీపావళి పండుగ.
జీవితంలోని చీకట్లను పారద్రోలి వెలుగులు నింపేదే దీపావళి . దీపావళి అంటేనే సరదాలు, సంబరాలు, దీపాల వెలుగులు, బాణాసంచాల జిలుగులు, కుటుంబం అంతా కలిసి జరుపుకునే వేడుకలు. దీపావళి అంటేనే కాంతులు నింపే పండుగ. అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని, దీపాలను వెలిగించి, ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నిండాలని ఆకాంక్షించే పండుగ దీపావళి.
దీపావళి అంటే దీపాల వరుస అని అర్ధం. దీనిని దీవాళి అని దీపావళి అని కూడా పిలుస్తారు. ప్రజలు తమ ఇళ్లలో,దుకాణాలలో దీపాలు, కొవ్వొత్తులను వెలిగించి, సంపద, అదృష్టం , శ్రేయస్సుకు ప్రతీక అయిన లక్ష్మీ దేవిని ప్రత్యేకంగా పూజిస్తారు.లేటెస్ట్‌లీ తరపున మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు.
సిరి సంపదలు, సౌభాగ్యం, స్నేహం ఎల్లప్పుడు మీ ఇంట వెల్లివిరియాలని కోరుకుంటూ..దీపావళి శుభాకాంక్షలు