Swami Vivekananda Best Quotations: నిరంతరం శ్రమిస్తూ అంతులేని ఆత్మస్థైర్యం, ఓరిమి కలిగి ఉన్న సామాన్య ప్రజలే ఈ దేశానికి వెన్నెముక. తనకు జైజైకారాలు పలుకుతున్నప్పుడు, తనకు గొప్పవాడుగా గుర్తింపు లభిస్తున్నపుడు పిరికివాడు కూడా ప్రాణత్యాగానికి వెనుకాడడు. తన గొప్పతనానికి మూలాధారమైన నైతిక విలువలు పాటిస్తూ అత్యంత శక్తి సామర్ధ్యాలు కలిగిన క్రిందిస్ధాయి ప్రజలలోనే భారతజాతి జీవించి ఉన్నది.
వారితోనే మళ్ళీ ఈ జాతి విశ్వగురుత్వ స్థానానికి ఎదుగుతుంది. ఆ గుడిసె వాసుల నుండే జాతి జాగృతమవుతుందని స్వామి వివేకానంద చెప్పిన జీవిత సత్యాలు నేటికి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఇప్పటి వరకు ఎంతో ఏడ్చాం. ఇంకా ఏడ్చేందుకు ఏమీ మిగలలేదు. లే ! లేచి నీ కాళ్లపై నీవు ఒక మనిషిగా నిలబడు అంటూ వివేకానంద చెప్పిన సూక్తులు ఎంతోమందిని స్థైర్యాన్ని నింపాయి. స్వామి వివేకానంద చెప్పిన కోట్స్ గురించి ఓ సారి తప్పక తెలుసుకోండి
మిమ్మల్ని బలవంతుడుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి. బలహీనపరిచే ప్రతి ఆలోచననూ తిరస్కరించండి.
ప్రతి రోజు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి. లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతారు.
నీ వెనుకాల ఏముంది.. ముందేముంది అనేది నీకు అనవసరం. నీలో ఏముంది అనేది ముఖ్యం
ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే.. ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది.
జీవితంలో ధనం కోల్పోతే కొంత కోల్పోయినట్టు కానీ, వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్టే.
విజయం కలిగిందని విర్రవీగకు, అపజయం కలిగిందని నిరాశపడకు. విజయమే అంతం కాదు, అపజయం తుది మెట్టు కాదు
మిమ్మల్ని బలవంతుడుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి. బలహీనపరిచే ప్రతి ఆలోచననూ తిరస్కరించండి.