1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు, రజాకార్లు, భారత యూనియన్‌లో దాని విలీనాన్ని వ్యతిరేకిస్తూ, హైదరాబాద్‌ను పాకిస్తాన్‌లో చేరాలని లేదా ముస్లిం ఆధిపత్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ ప్రాంతాన్ని యూనియన్ ఆఫ్ ఇండియాలో విలీనం చేసేందుకు స్థానిక ప్రజలు రజాకార్ల దురాగతాలకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడారు. రజాకార్లు అనే ప్రైవేట్ మిలీషియా ఇక్కడి ప్రజలపై దౌర్జన్యాలకు పాల్పడి హైదరాబాద్ లో అప్పటి నిజాం పాలనను సమర్థించారు. 1948 సెప్టెంబర్ 17న అప్పటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ సైనిక చర్యతో నిజాంల పాలనలో ఉన్న అప్పటి హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్‌లో విలీనమైంది.  17 సెప్టెంబర్ 1948 నాడు తెలంగాణ గడ్డకు స్వాతంత్రం.. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల ‘ఉజ్వల చరిత్ర’ ను భావి తరాలకు అందిద్దాం, నిజాం కు వ్యతిరేకంగా పోరాటం చేసి అసువులు బాసిన అమరులకు నివాళులు అర్పిద్దాం.. తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు

నిజాం నిరంకుశత్వానికి చామరగీతం పాడి తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్య్రాలను అందించిన అమరవీరులను స్మరిస్తూ... తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు

అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ.. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు.

నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తి పొంది భారతదేశం లో అధికారికంగా విలీనమైన రోజు సందర్బంగా తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు

నాజీల మించిన నైజామ్ సర్కారోడిని ప్రాణాలొడ్డి ఢీకొన్న పోరాట యోధులకు ధన్నుగా నిలిచిన భారత సర్కార్, ఉక్కు మనిషి పటేల్ నేతృత్వంలో జరిపిన "ఆపరేషన్ పోలో " తో ఆరాచక పాలనకు స్వస్తి పలికిన రోజు ఈ రోజు.. తెలంగాణ విమోచన దినోత్సవ సందర్బంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు..

నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తి పొంది భారత దేశంలో విలినమైన రోజు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు.

నిజాం సర్కార్ మెడలు వంచిన రోజు,రజాకార్ రక్కసి మూకలను అణిచివేసిన రోజు,నిరంకుశ,బానిసత్వ,రాచరిక,రాక్షస పాలన సంకేళ్ల నుండి తెలంగణా విముక్తి పొంది భారతమాత ఒడిలో చేరిన రోజు రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు